ఇటీవలే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూని ఘనంగా నిర్వహించిన విశాఖపట్టణం మరొక వేడుకకు ముస్తాబైంది. బహుళ దేశాల నౌకదళాల విన్యాసం మిలన్-2022 సాగర తీరంలో ప్రారంభమైంది. 8 రోజుల పాటు రెండు దశల్లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పలు దేశాలకు చెందిన నౌకలు విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు ఈ విన్యాసాలు జరుగనున్నాయి. తొలిరోజు హర్బర్ దశలో సాంకేతిక అంశాలను పరిశీలించారు. వివిధ దేశాల నేవీల ప్రతినిధులు.
Also Read : రష్యా తీరుపై కేఏ పాల్ ఆగ్రహం.. అందుకోసమే నిరహార దీక్ష
Advertisement
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సాంగత్యం, పొందిక సహకారం లక్ష్యాలుగా ఈ మిలన్‌ను నిర్వహిస్తున్నారు. మిలన్ -2022 లో భాగంగా ఫిబ్రవరి 27న విశాఖ ఆర్.కే. బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగనుంది. ఇందులో నేవీ కవాతుతో పాటు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేవిధంగా ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖ నౌక, జలాంతర్గామి ఐఎన్ఎస్లను సీఎం సందర్శించనున్నారు.
Advertisement
సాంస్కృతిక బృందాలతో నేవీ నిర్వహించే ఈ పరేడ్ ఆకర్షణీయంగా సాగనుంది. నౌకదళం సాహస విన్యాసాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. గగన తలంలో ఎయిర్ క్రాప్ట్‌లు, హెలీకాప్టర్లు సాహస విన్యాసాలతో నగర వాసులను అలరించనున్నాయి. మిలాన్ 2022 ఉత్సవాల కోసం ఇప్పటికే ఆర్.కే.బీచ్‌లో నౌకాదళం విస్తృత ఏర్పాట్లు చేసింది. అటు మిలాన్ 2022 నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. విశాఖ పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా. బీచ్‌రోడ్డు కోస్టల్ బ్యాటరీ నుండి పార్కు హోటల్ కూడలి వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు.
Also Read : ప్రపంచానికి గురువుగా మారాలన్నదే భారత్ కల : రాజ్ నాథ్ సింగ్