Home » రష్యా తీరుపై కేఏ పాల్ ఆగ్రహం.. అందుకోస‌మే నిర‌హార దీక్ష

రష్యా తీరుపై కేఏ పాల్ ఆగ్రహం.. అందుకోస‌మే నిర‌హార దీక్ష

by Anji
Ad

ఉక్రెయిన్ పై ర‌ష్యా వ‌రుస‌గా మూడ‌వ రోజు యుద్ధం కొన‌సాగిస్తున్న‌ది. బాంబుల మోత‌కు ఉక్రెయిన్ భూభాగం ద‌ద్ద‌రిల్లుతోంది.  ప్ర‌జ‌లు ప్రాణాలు కాపాడుకునేందుకు అండ‌ర్ గ్రౌండ్ మెట్రో స్టేష‌న్లు, బంక‌ర్ల‌ల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా ఈస్థాయిలో విరుచుకుప‌డడంపై ప్ర‌పంచ దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ ర‌ష్యా ఈ స్థాయిలో విరుచుకుప‌డ‌డంపై ప్ర‌పంచ దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపి, శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధం కావాల‌ని ర‌ష్యాకు సూచిస్తున్నా. ర‌ష్యా మాత్రం ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

Also Read :  కోహ్లీ స్పెష‌ల్ మ్యాచ్ పై బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. మండిప‌డుతున్న అభిమానులు..!

Advertisement

తాజాగా ఉక్రెయిన్ ర‌ష్యా సంక్షోభంపై ప్ర‌పంచ శాంతి దూత కే.ఏ.పాల్ స్పందించారు. ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. పుతిన్ మెంట‌లోడు అని, యుద్ధాన్ని ఆపాల‌ని చాలా రోజులుగా చెబుతున్నా విన‌కుండా ఇలా చేస్తున్నాడంటూ దూషించారు. ఉక్రెయిన్- ర‌ష్యాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం త‌లెత్త‌కుండా ఉండేందుకు తాను 21 రోజులుగా నిర‌హార దీక్ష కూడా చేస్తున్న‌ట్టు చెప్పారు పాల్‌. ఉక్రెయిన్‌లో నెల‌కొన్ని ప‌రిస్థితుల‌ను త‌ల‌చుకుని ఆయ‌న కంట‌త‌డి పెట్టారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా వెంట‌నే యుద్ధాన్ని ఆపాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.

Advertisement

అమెరికా సైన్యాన్ని ఉక్రెయిన్ కు పంపాల‌ని తాను కొద్ది రోజుల క్రిత‌మే బైడెన్‌కు చెప్పాను అని కే.ఏ.పాల్ పేర్కొన్నారు. అప్పుడు ఓకే చెప్పి బైడెన్ ఇప్పుడు వెన‌క్కి త‌గ్గారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బైడెన్ కు కూడా క‌ళ్లు నెత్తికెక్కాయంటూ మండిప‌డ్డారు. ఈ యుద్ధం వ‌ల్ల ఉక్రెయిన్‌లో అమాయ‌క ప్ర‌జ‌లు చ‌నిపోతున్నార‌ని ర‌ష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధ ఫ‌లితం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డుతుంద‌ని ఫ‌లితంగా అన్ని ధ‌ర‌లు పెరిగి, సామాన్యుడిపై భారం ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా యుద్ధాన్ని అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కే.ఏ.పాల్‌.

Also Read :  ర‌ష్యాపై సోషల్‌ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం..!

Visitors Are Also Reading