టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుందని 23 ఏళ్ల పాకిస్తాన్ యువ ఆటగాడు షాహ్ నవాజ్ దహాని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గత టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ధోనీనీ కలిసిన క్షణాలను దహాని గుర్తుకు చేసుకున్నాడు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌లోనే ప్రపంచ కప్ ప్రారంభమైన విషయం తెలిసినదే. ధోనీ టీమిండియాకు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Advertisement
టోర్నీలో భారత్ గ్రూపు స్టేజ్‌లోనే నిష్క్రమించగా పాక్ సెమిస్‌లో ఆసీస్ చేతిలో ఓటమితో ఇంటి ముఖం పట్టింది. అయితే షాహ్ నవాజ్‌కు పాక్ తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేయకపోవడం గమనార్హం. ఎం.ఎస్.ధోనీని కలవాలని ఎప్పటి నుంచో అనుకున్నట్టు ఆ కోరిక టీ-20 ప్రపంచ కప్ సందర్భంగా నెరవేరిందని తెలిపాడు షామ్ నవాజ్. ధోనీ ఇచ్చిన సూచనలు చాలా విలువైనవని చెప్పారు. ధోనీని కలవడం.. తన కల నిజమైన వేళ అంటూ.. ఆనందం వ్యక్తం చేశాడు.
Advertisement
ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ధోనీని కలవాలనే కల నిజమైంది. జీవితంలో ఆ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేను. జీవితం గురించి పెద్దవాళ్లను ఏ విధంగా గౌరవించాలి. క్రికెట్ లో మంచి రోజులు, కలిసి రాని రోజులుంటాయని చెప్పాడు. అయితే ఆట పట్ల అంకిత భావం ప్రదర్శించాలి. ఆటను ఎక్కువగా ప్రేమిస్తేనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలవని వివరించాడని దహాని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్‌ను కలవాలని ఉందని తన మనస్సులోని మాటను వెల్లడించాడు. కివీస్ పేసర్ షేన్ బాండ్‌ను చూస్తూ పెరిగానని, అతను రిటైర్డ్ అయ్యాక జోప్రా ఆర్చర్ తన పదునైన బౌలింగ్‌తో ఆకర్షించాడని దహాని వివరించాడు.
Also Read : బరోడా క్రికెటర్‌కు అభిమానులు సెల్యూట్.. ఎందుకో తెలుసా..?