Home » బ‌రోడా క్రికెట‌ర్‌కు అభిమానులు సెల్యూట్‌.. ఎందుకో తెలుసా..?

బ‌రోడా క్రికెట‌ర్‌కు అభిమానులు సెల్యూట్‌.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

రంజీ ట్రోపీలో బ‌రోడా త‌రుపున ఆడిన విష్ణు సోలంకి చండీగ‌డ్‌పై సెంచ‌రీ చేశాడు. సెంచ‌రీ కొట్టిన విష్ణుకు అంద‌రూ సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్రీడాకారుడు త‌న‌లోని ఎంతో బాధ‌ను దాచిపెట్టుకుని కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడే పుట్టిన త‌న అమ్మాయి ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో ఈ లోకాన్ని వీడిన‌ది. కూతురి మ‌ర‌ణం విష్ణును కుదిపేసిన‌ది. అయితే త‌న కుమార్తెకు అంత్య‌క్రియ‌లు చేసిన త‌రువాత మైదానంలోకి వెళ్లిన త‌న జ‌ట్టు త‌రుపున సెంచ‌రీ చేశాడు. చండీగ‌డ్ పై విష్ణు 12 పోర్ల సాయంతో 104 ప‌రుగులు చేశాడు. బ‌రోడా క్రికెట్ అసోసియేన్ అత‌న్ని రియ‌ల్ హీరో అని అభివ‌ర్ణించింది. అత‌ని బోల్డ్ ఇన్నింగ్స్ చూసి అంద‌రూ సెల్యూట్ చేస్తున్నారు.

Also Read :  భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ లో ఫ్యాన్స్ తో త‌మ‌న్ రచ్చ‌…వీడియో వైర‌ల్…!

Advertisement

అదే స‌మ‌యంలో సౌరాష్ట్ర త‌రపున రంజీ ట్రోపీ ఆడుతున్న బ్యాట్స్‌మెన్ షెల్డ‌న్ జాక్స‌న్ ట్వీట్ చేస్తూ.. విష్ణుకు అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు న‌మ‌స్క‌రిస్తున్నాను. అత‌ని బ్యాట్ నుంచి మ‌రిన్నీ సెంచ‌రీలు రావాల‌ని పేర్కొన్నాడు. రంజీ ట్రోపీలో బ‌రోడా త‌రుపున ఆడిన విష్ణు సోలంకి చండీగ‌డ్ పై సెంచ‌రీ చేశాడు. కొట్టిన విష్ణుకు అంద‌రూ సెల్యూట్ చేస్తున్నారు.

Advertisement

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌న తండ్రి ప్రొఫెస‌ర్ రమేష్ టెండూల్క‌ర్ మ‌ర‌ణించిన వెంట‌నే 1999 ప్ర‌పంచ క‌ప్ సంద‌ర్భంగా సెంచ‌రీ సాధించాడు. టెండూల్క‌ర్ మాట్లాడుతూ.. నేను ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు మా అమ్మ‌ను చూసి భావోద్వేగానికి గుర‌య్యాను. మా నాన్న చ‌నిపోయిన త‌రువాత ఆమె మ‌రింత దిగులుగా ఉంది. కానీ ఆ దుఃఖంలో కూడా నేను ఇంట్లో ఉండ‌కూడ‌దు అని, జ‌ట్టు కోసం ఆడాల‌ని కోరుకుంది. కెన్యాపై ఆ సెంచ‌రీ సాధించిన‌ప్పుడు చాలా భావోద్వేగానికి గుర‌య్యానని పేర్కొన్నాడు. కెన్యాపై స‌చిన్ 101 బంతుల్లో 140 ప‌రుగులు చేశాడు.

 రంజీ మ్యాచ్‌ల‌లో భార‌త మాజీ కెప్టెన్ కోహ్లీకి కూడా అలాంటిదే జ‌రిగింది. అత‌ను ఢిల్లీ జ‌ట్టుకు ఆడుతున్నాడు. అత‌ని తండ్రి హ‌ఠాత్తుగా మ‌ర‌ణించాడు. ఇదిలా ఉండ‌గా.. విరాట్ బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీ సాధించి జ‌ట్టును ఓట‌మి నుంచి కాపాడాడు. అనంత‌రం త‌న తండ్రి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నాడు.

Also Read :  SAMANTHA : స‌మంత‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అరుదైన అవార్డు..!

Visitors Are Also Reading