మామూలుగా వర్కవుట్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దాని కోసం ఎంతో కొంత కష్టపడాలి. వర్కవుట్స్ లో కూడా చాలా ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే అది సాధ్యమవుతుంది. చాలా మంది బాడీ ఫిట్‌నెస్ కోసం భారీగా వర్కవుట్ చేస్తుంటారు. జిమ్ కు వెళ్తుంటారు. లేదంటే ఇంట్లోనే వ్యాయామం చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి ఏమి చేశాడో తెలుసా..? ఏకంగా హెలికాప్టర్‌కు వేలాడి అది గాల్లో ఉండగా దానిని పట్టుకుని పుల్ ఆప్స్ చేశాడు. అలా ఆర్మేనియాకు చెందిన రోమన్ సహ్రద్యాన్ అనేక వ్యక్తి 23 పుల్ ఆప్స్ చేసి రికార్డు సృష్టించాడు. అదంతా కేవలం ఒక్క నిమిషంలోనే చేయడం గమనార్హం.
Advertisement
కింద పడుకుని పుష్ అప్స్ అందరూ చేస్తారు. పుల్ అప్స్ కూడా అందరూ చేస్తారు. కానీ ఇలా గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్‌ను పట్టుకుని పుల్ అప్స్ చేయడం అనేది దాదాపు అసాధ్యమైన పని. దానిని సుసాధ్యం చేశాడు కాబట్టే రోమన్ అనే వ్యక్తి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.