Home » Mekapati Goutham Reddy : రూ.250 కోట్ల ఆస్తులు ప్ర‌భుత్వానికి.. గౌత‌మ్‌రెడ్డి పేరిట అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ

Mekapati Goutham Reddy : రూ.250 కోట్ల ఆస్తులు ప్ర‌భుత్వానికి.. గౌత‌మ్‌రెడ్డి పేరిట అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ

by Anji
Ad

మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఇంజినీరింగ్ క‌ళాశాల‌ను మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి పేరుతో అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీగా మార్చాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని రాజ‌మోహ‌న్‌రెడ్డి కోరారు. ఇంత‌టి బాధ స‌మ‌యంలో కూడా నెల్లూరు పెద్దాయ‌య‌న రాజ‌మోహ‌న్‌రెడ్డి ఉద‌య‌గిరి, ఆత్మ‌కూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మ‌రువలేదు. ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో మంత్రి గౌత‌మ్‌రెడ్డి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

Also Read :  బాంబుల మోత‌ మధ్య మెట్రో అండ‌ర్ గ్రౌండ్‌లో ప్ర‌స‌వించిన గ‌ర్భిణి

Advertisement

Advertisement

అయితే ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో ఉద‌య‌గిరిలో 100 ఎక‌రాల‌లో తాను ఏర్పాటు చేసిన ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌కు చెందిన రూ.225 కోట్లు విలువైన ఆస్తుల‌ను ప్ర‌భుత్వానికి స్వ‌చ్ఛందంగా అప్ప‌గించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు సీఎంతో చెప్పారు. దీనికి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి పేరుతో అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీగా మార్చాల‌ని కోరారు. త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌లో క‌ళాశాల పేరు మార్చ‌డంతో పాటు అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీగా మార్చ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.

 


ఉన్న‌త విద్యావంతుడు, వ్యాపార‌వేత్త అయిన మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌ని చేసి ఉత్త‌మ పేరు తెచ్చుకున్నారు. అన‌తి కాలంలో ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌ల‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషించార‌ని కొనియాడారు. అకాల మ‌ర‌ణం రాష్ట్రానికి తీర‌ని లోటు అన్నారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.

Also Read :  భీమ్లానాయ‌క్ లో కీల‌కపాత్ర‌లో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా…!

Visitors Are Also Reading