రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ టెన్నిస్ ప్రపంచంలో శిఖర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లలో మెద్వెదెవ్‌కు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు దక్కనుంది. తన కెరీర్‌లో ఒకే ఒక గ్రాండ్ స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్ కపెల్నికోవ్, మారత్ సఫిన్ తరువాత అగ్రస్థానానికి చేరిన మూడవ రష్యా ఆటగాడిగా నిలిచాడు.
Also Read : రష్యా పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఏమన్నారంటే..?
Advertisement
Advertisement
దుబాయ్ ఓపెన్‌లో కనీసం సెమీఫైనల్ చేరితే నెంబర్ వన్ ర్యాంకు నిలబెట్టుకోగలిగే స్థితిలో బరిలోకి దిగిన నోవాక్ జొకొవిచ్ (సెర్బియా) గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్యంగా 4-6, 6-7తేడాతో వరల్డ్ నెంబర్ 123 జిరి వెస్లీ చేతితో పరాజయం పాలై అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఫిబ్రవరి 2020 నుంచి జొకొవిచ్ నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. ఫెడరర్, నాదల్, జొకొవిచ్, ముర్రె ను మినహాయించి గత 18 ఏళ్లలో 2004నుంచి జొకొవిచ్ నెంబర్ వన్ స్థానానికి చేరిన తొలి ఆటగాడు కావడం విశేషం.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఊహించని చికాకులు తలెత్తుతాయి