ప్రతీ సంవత్సరం వేసవి కాలం వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఇక ఐపీఎల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చి 27 నుంచి జరుగబోయే ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో పంజాబ్ కింగ్స్ నూతన కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్‌ను నియమిస్తున్నట్టు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై అత్యంత త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు వివరించారు.
Also Read : యుద్ధం సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు
Advertisement
Advertisement
ఈసారి మెగా వేలానికి ముందు పంజాబ్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకున్న సంగతి తెలిసినదే. అందులో ఒకరు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కాగా.. మరొకరు యువ పేసర్ అర్షదీప్ సింగ్ ఉన్నారు. ఈ సారి అధిక మొత్తంలో వేలంలో పాల్గొన్న పంజాబ్ జట్టు పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేసింది. శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, కగీసోరబాడ వంటి స్టార్ ఆటగాళ్లను దక్కించుకున్నది. ఈ నేపథ్యంతో కొత్త కెప్టెన్ గా ధావన్‌కు అవకాశం ఇస్తారని అందరూ భావించినా జట్టు యజమాన్యం మాత్రం మయాంక్ వైపే మొగ్గు చూపిందని ఆయన చెప్పారు.
గత రెండేండ్ల కాలం నుంచి పంజాబ్ కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కే.ఎల్. రాహుల్ ఈసారి కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్‌కు వెళ్లిపోయారు. దీంతో అతడు ఆ జట్టుకు కెప్టెన్సీ చేపట్టనున్నారు. గత రెండేళ్లుగా రాహుల్‌కు జోడిగా అదిరిపోయే బ్యాటింగ్ మయాంక్ ను ఈసారి సారథిగా నియమించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించుకున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు.
Also Read : భీమ్లానాయక్ పై ఆర్జీవీ సెటైర్లు…పవన్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్…!