Home » పాకిస్తాన్ ప్ర‌ధాని ర‌ష్యా దాడిపై ఏమ‌న్నారంటే..?

పాకిస్తాన్ ప్ర‌ధాని ర‌ష్యా దాడిపై ఏమ‌న్నారంటే..?

by Anji
Published: Last Updated on
Ad

పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌రొక‌సారి త‌న యుద్దోన్మాదాన్ని ప్ర‌క‌టించాడు. ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఇమ్రాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్యంగా ఎన్నాళ్ల నుంచి వేచి ఉన్న ఉద‌యం వ‌చ్చిందంటూ ర‌ష్యా చేసిన దాడి సంతోషాన్ని క‌లిగిందంని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న దాడిని ఇమ్రాన్ స‌మ‌ర్థించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌పై ర‌ష్యా దురాక్ర‌మ‌ణ సాగుతుంది.

ఉద‌యం నుంచి కీవ్ గ‌గ‌న‌త‌లంలో చ‌క్క‌ర్లు కొడుతున్న ర‌ష్యా విమానాలు అనేక ప్రాంతాల‌పై దాడి కొన‌సాగిస్తున్నాయి. తాజాగా కీవ్ ఎయిర్ ఫోర్టుపై ర‌ష్యా సైన్యం మిస్సైల్ దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఎయిర్‌ఫోర్టులో కొంత భాగం ధ్వంసం అయిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇలాంటి సంక్షోభ ప‌రిస్థితుల స‌మ‌యంలో ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ర‌ష్యా మాస్కో వెళ్లారు. రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక బంధాన్ని ప‌టిష్టం చేసుకునేందుకు ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు ఇమ్రాన్‌.

Advertisement

Advertisement

 

దాదాపు రెండు ద‌శాబ్దాల త‌రువాత ర‌ష్యాలో ప‌ర్య‌టిస్తున్న పాకిస్తాన్ ప్ర‌ధానిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశారు. ర‌ష్యాకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్‌కు ఆదేశం రెడ్ కార్పేట్ స్వాగ‌తం ప‌లికింది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు విదేశాంగ మంత్రి షా మ‌హ‌మూద్ ఖురేషి స‌మాచార మంత్రి ఫ‌వాద్ చౌద‌రి, ప్ర‌ణాళిక అభివృద్ధి మంత్రి అస‌ద్ ఉమ‌ర్‌, వాణిజ్య స‌ల‌హాదారు అబ్దుల్ ర‌జాక్ దావూద్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు డాక్ట‌ర్ మొయిద్ యూసుఫ్ ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

Also Read :  రామ్ చ‌ర‌ణ్ కంటే ముందు “మ‌గ‌ధీర” క‌థ‌ ఎవ‌రి వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా..?

Visitors Are Also Reading