ఇప్పటివరకు ఎద్దు దాడికి సంబంధించిన వీడియోలను చాలా చూశాం. సాధారణంగా ఎద్దు దాడి చేయదు. తన దారికి ఎవరైనా అడ్డు వచ్చినప్పుడో లేక మరేదైనా ఇతర కారణాల వల్లనో ఒక్కోసారి భయంకరంగా దాడి చేస్తుంటుంది. ఎద్దు దాడి ఘటనల్లో కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. అమెరికాలో చోటుచేసుకున్న ఓ ఘటనలో సైకిల్ రైడర్‌పై ఎద్దు దారుణంగా దాడి చేసింది.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొంటున్న సైకిల్ రైడర్లపై ఎద్దు దాడి చేసింది. ముగ్గురు వ్యక్తులు సైకిల్ రేసింగ్ చేస్తుండగాఏ ఒక ఎద్దు అనూహ్యంగా ఓ సైకిల్ రైడర్‌పై దారుణంగా దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాతంగా గాల్లోకి ఎత్తిపడేసింది. అక్కడ ఉన్న మిగతా వాళ్లపై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది.
అదృష్టవశాత్తు వారికి ఏమి కాలేదు ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు.అయితే వారు రేసింగ్ మొదలు పెట్టినప్పుడు ఎద్దు యజమాని దానిని గడ్డి ఉన్న బీడుభూమి వైపునకు చాలా దూరం తీసుకెళ్లాడు. అయినప్పటికీ అది తిరిగి వచ్చి మరీ వాటిపై దాడి చేసింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఓ లుక్కెయండి.
Also Read : డేరాబాబాకు జడ్ ప్లస్ సెక్యురిటీ..ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!