Home » T20 World Cup: అరంగేట్రంలోనే సూపర్ సెంచరీ.. ప్ర‌పంచ రికార్డు సొంతం

T20 World Cup: అరంగేట్రంలోనే సూపర్ సెంచరీ.. ప్ర‌పంచ రికార్డు సొంతం

by Anji
Ad

క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎంతో ఆస‌క్తి క‌రం. అందులో టీ-20 ప్ర‌పంచ క‌ప్ అంటే మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు అభిమానులు. ఇక ఆరంగేట్రంలోనే సెంచ‌రీ సాధిస్తే ఆ బ్యాట్స్‌మెన్ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. 22 ఏళ్ల కెన‌డా బ్యాట్స్‌మెన్ మాథ్యూ స్పూర్స్ చ‌రిత్ర సృష్టించాడు. టీ-20 ప్ర‌పంచ క‌ప్ క్వాలిఫైయ‌ర్ ఫిలిప్పిన్స్‌పై ఆరంగేట్రం చేశాడు. టీ-20 ఇంట‌ర్నేష‌న‌ల్ మొద‌టి ఇన్నింగ్స్ లో సెంచ‌రీ బాదాడు.

Also Read :  IPL 2022 Auction : నికోలస్ పూరన్ కొనుగోలుపై ఎస్ఆర్‌హెచ్ కోచ్ ఏమ‌న్నారో తెలుసా..?

Advertisement

Advertisement

కెన‌డా త‌రుపున మాథ్యూస్ప‌ర్ టీ-20 మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసి ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగాడు. త‌న భాగ‌స్వామి ప‌ఠాన్‌తో క‌లిసి తొలి వికెట్‌కు 149 ప‌రుగులు చేశాడు. త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్‌లో మాథ్యూ చివ‌రి వ‌ర‌కు నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మాథ్యూ 66 బంతులు ఎదుర్కొని 108 నాటౌట్‌గా నిలిచాడు. అందులో 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లుగా మ‌లిచాడు. మాథ్యూస్ప‌ర్స్ అజెయ సెంచ‌రీతో కెన‌డా 20 ఓవ‌ర్ల‌లో 1 వికెట్ న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది.

భారీ ల‌క్ష్యం చేదించ‌డం టార్గెట్ పెట్టుకున్న ఫిలిప్పిన్స్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 98 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. 118 ప‌రుగుల భారీ తేడాతో కెన‌డా విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో కెన‌డా త‌న గ్రూప్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంది. గ్రూపు-బీలో కెన‌డా-ఫిలిప్పిన్స్ జ‌ట్ల మ‌ధ్య ఇదే తొలి మ్యాచ్ కావ‌డం విశేషం.

Also Read :  చ‌మురు కొనుగోలుకు పైస‌ల్ నిల్‌.. చేతులెత్తిన లంక ప్ర‌భుత్వం

Visitors Are Also Reading