కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. కొత్త వేరియంట్ ల రూపంలో ఎంట్రీ ఇస్తూ ఆందోలనకు గురిచేస్తోంది. ఇక కరోనాకు వ్యాక్సిన్ తప్ప మరో మందు లేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే దేశంలో రెండు మూడు రకాల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉండగా ఇప్పుడు 12 నుండి 18 ఏళ్ల మధ్య వయసు వారి కోసం కొర్బెవాక్స్ అనే మరో వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చారు.
Advertisement
Advertisement
హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ అనే ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అమోదం తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో ప్రస్తుతం 15 నుండి 18 ఏళ్ల మధ్య వయసువారికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఇస్తున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లోనే తయారు చేసిన మరో వ్యాక్సిన్ కొర్బెవాక్స్ కు అనుమతులు రావడం చెప్పుకోదగ్గ విషయం. ఇక దేశంలో కరోన కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న సంగతి తెలిసిందే.