మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణాన్ని ఆయన సన్నిహితులు, స్నేహితులు కుటుంబ సభ్యులు జీర్ణించుకులేక పోతున్నారు. సరదాగా ఉన్న ఆయన ఈరోజు లేరంటే నమ్మలేకపోతున్నమంటూ కన్నీటిపర్వతమవుతున్నారు. సీఎం జగన్ అయితే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరణవార్త విన్న వెంటనే హుటాహుటిన హైదరాబాద్‌కు పయనం అయ్యారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గన్నారు మంత్రి మేకపాటి. హైదరాబాద్‌కు ఆదివారం చేరుకున్నారు. వచ్చిన వెంటనే నిన్న రాత్రి నెల్లూరులో ఓ శుభకార్యంలో గౌతం రెడ్డి పాల్గొన్నారు. ఆ ఫంక్షన్‌లో బంధువులు, సన్నిహితులతో చాలా సరదాగా గడిపారు.
Also Read : ఆ బాలుడు తొమ్మిదేళ్ల వయస్సులోనే యోగా గురువు.. గిన్నిస్ బుక్‌లో చోటు
Advertisement
Advertisement
ఆ తరువాత కార్యక్రమం ముగిసిన తరువాత హైదరాబాద్ చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. నిన్న రాత్రి నెల్లూరులో జరిగిన వేడుకల్లో తమతో కలిసి ఆనందంగా గడిపిన గౌతంరెడ్డి ఈరోజు లేరనడం నిజంగా చాలా బాధకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జేసీ అష్మిత్ రెడ్డిఓ ఫొటోతో నివాళుర్పించారు. గౌతంరెడ్డి చివరి ఫొటో ఇదే అని అందరూ భావిస్తున్నారు.
అపోలో ఆసుపత్రి ఉంచి జూబ్లీహిల్స్‌కు గౌతంరెడ్డి పార్థివదేహాన్ని తరలించిన అనంతరం సీఎం జగన్ భార్య భారతిరెడ్డి, తల్లి విజయమ్మ నేరుగా అక్కడికి చేరుకున్నారు. గౌతం రెడ్డి భార్యను ఓదార్చే ప్రయత్నం చేసారు. మరణ వార్త విన్న షర్మీల కూడా గౌతమ్‌రెడ్డి ఇంటికి చేరుకుని భౌతిక ఖాయానికి నివాళులర్పించారు. వీరితో పాటు పలువురు రాజకీయనాయకులు నివాళులర్పించారు.
Also Read : పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో తీవ్ర విషాదం..!