బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ భారత స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టులోకి పునరాగమనం చేయడం గురించి మాట్లాడారు. శ్రీలంకతో జరిగే స్వదేశీ సిరీస్ కోసం భారత టెస్ట్, టీ-20 జట్టులను శనివారం ప్రకటించింది. టీ-20 ఫిబ్రవరి 24న ప్రారంభం అవ్వడంతో స్వదేశంలో 3 టీ-20 మ్యాచ్‌లు ఆడతారు. అదేవిధంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి తిరిగి వచ్చిన తరువాత టెఎస్ట్, టీ-20 రెండింటికీ సెలెక్ట్ అయ్యాడు. హార్థిక్ ఎంపికకు అందుబాటులో లేడు. ఆల్ రౌండర్ 2021 టీ-20 ప్రపంచ కప్ తరువాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాడు.
Also Read : రోజుకో 5 జబర్ధస్ సినిమా డైలాగ్స్ ! Today’s 5 dialogues
Advertisement
Advertisement
చీఫ్ సెలెక్టర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా విశ్రాంతి ముగించుకోగానే వెంటనే జట్టులోకి తీసుకుంటాం అని.. అతను 100 శాతం ఫిట్‌గా ఉంటే తప్పకుండా అతని ఫిట్‌నెస్ బౌలింగ్‌పై సరైన నిర్ధారణ వచ్చే వరకు సెలక్షన్ ప్యానెల్ అతని పునరాగమనంపై నిర్ణయం తీసుకోదు అని చెప్పాడు. భారతజట్టులో హార్దిక్ కీలకమైన ఆటగాడు అని.. ప్రస్తుతం అతను ఫిట్‌గా లేడని ఫిట్‌గా ఉన్నాడని మాకు సమాచారం రాలేదని అందుకు సెలెక్ట్ చేయలేదని చెప్పాడు.
పాండ్యా సెలక్ట్ చేయకపోవడంతో టీ-20లో వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా వంటి వారికి ఆల్‌రౌండర్ స్థానానికి టీమ్ ఇండియా అవకాశం ఇచ్చింది. శార్దూల్ ఠాకూర్ దీపక్ చాహర్ కూడా బ్యాట్, బాల్ రెండింటిలో దూసుకెళ్లుతున్నారు. జట్టు కోసం చాలా ఉపయోగకరమైన ఆల్‌రౌండర్లుగా ఆకట్టుకునే ప్రదర్శనలను పెంచుకున్నారు. మరొక వైపు రాబోయే 2022 ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా నాయకత్వం వహిస్తాడు. ఐపీఎల్ మార్చి 27న ప్రారంభం కానుండగా.. మే 28న ఫైనల్ మ్యాచ్ ముగియనుంది.
Also Read : IPL 2022 : ఐపీఎల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు