భారత్‌లో ఐపీఎల్ మాదిరిగానే పాకిస్తాన్‌లో పీఎస్ఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ ఈ లీగ్ మ్యాచ్‌లు ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ ఫాల్క్‌నర్ ఆసక్తికరమై ట్వీట్ చేశాడు. ముఖ్యంగా నేను పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు కోరుతున్నాను. దురదృష్టావశాత్తు గత రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలగాల్సి వచ్చింది. PCB నా ఒప్పందం చెల్లింపులను గౌరవించనందున పీఎస్ఎల్ టీ-20 ను8ంచి వైదొలగాల్సి వచ్చింది. నేను ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను. వారు నాతో అబద్దాలు చెబుతూనే ఉన్నారు. పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి పొందేందుకు నేను సాయం చేయాలనుకున్నాను. ప్రతిభ ఉండడంతో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అభిమానులందరూ నా పరిస్థితిని కచ్చితంగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.
Also Read : ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణపై దాడి…!
Advertisement
Advertisement
మరొక వైపు ఇటీవల పీసీబీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఫాల్క్‌నర్ చెప్పేది వాస్తవం కాదు అని.. జేమ్స్ పాల్క్‌నర్ గురించి త్వరలో ఓ వివరణాత్మక ప్రకటన విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. సాంప్రదాయకంగా, ఫ్రాంచైజీల నుంచి డబ్బును రీకవరీ చేయడానికి ముందు పీసీబీ ఎల్లప్పుడూ ప్లేయర్ చెల్లించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఫాల్క్‌నర్ ప్రాథమిక ఫిర్యాదు అతని ఫ్రాంచైజీకి బదులుగా పీసీబీకి ఎందుకు ఉందో వివరించవచ్చు. ఆస్ట్రేలియన్ చెల్లింపు వివాదం పీసీబీతో ఉందని చెబుతూ గ్లాడియేటర్స్ సమస్య నుంచి ఫాల్క్‌నర్ దూరంగా ఉంటున్నారని పేర్కొంది.
ఫాల్క్‌నర్ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లలో ఆడారు. ఆరు వికెట్లు తీయడంతో పాటు 49 పరుగులు చేశాడు. చెల్లింపు వివాదం కారణంగా పాకిస్తాన్ లీగ్ నుంచి అకాలంగా నిష్క్రమించాడు. పీసీబీ కాంట్రాక్టుగా అంగీకరించిన చెల్లింపులను గౌరవించలేదనే మ్యాచ్‌లు ఆడడం లేదు. క్వెట్టా గ్లాడియేటర్స్ చివరి మూడు మ్యాచ్‌లను ఆడని ఫాల్క్‌నర్.. ఈ విషయంపై మరింతగా రెచ్చిపోయాడు. ముఖ్యంగా పీసీబీ అధికారులతో చర్చలు జరిపిన తరువాత తన బ్యాట్, హెల్మెట్‌ను షాన్డిలియర్ పైకి విసిరాడు. తాజాగా ఇవాళ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ పోస్ట్ చేశాడు ఫాల్క్‌నర్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివాదం ఎంత వరకు వెళ్లుతుందో చూడాలి మరి.
Also Read : సుడిగాలి సుధీర్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో చెప్పిన బుల్లెట్ భాస్కర్