Home » ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత చిన్ని కృష్ణ‌పై దాడి…!

ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత చిన్ని కృష్ణ‌పై దాడి…!

by AJAY
Ad

ప్ర‌ముఖ సినీ రచ‌యిత చిన్ని కృష్ణ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌న పై దాడి జ‌రిగింద‌ని చెబ‌తు చిన్ని కృష్ణ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్ ప‌రిధిలోని శంక‌ర్ ప‌ల్లి గ్రామ శివార్ల‌లో ఉన్న త‌న స్థ‌లాన్ని కొందరు ఆక్ర‌మించుకున్నార‌ని చిన్ని కృష్ణ చెబుతున్నారు. త‌న భూమిని క‌బ్జా చేశార‌ని హైకోర్టులో కేసు వేసినందుకు త‌న‌పై దాడి చేశార‌ని చిన్ని కృష్ణ ఆరోపిస్తున్నారు. చిన్ని కృష్ణ ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేసుకున్నారు.

Advertisement

Advertisement

త‌న పై దాడి చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలంటూ చిన్ని కృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా చిన్ని కృష్ణ ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు క‌థ‌లు అందించారు. స్టార్ హీరోల సినిమాల‌కు క‌థ‌ను అందించి టాలీవుడ్ లో ప్ర‌ముఖ ర‌చయిత‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్ని కృష్ణ స్టోరీ అందించిన సినిమాల్లో గంగోత్రి, న‌ర‌సింహ‌నాయుడు, ఇంద్రా సినిమాలు బ్లాక్ బ‌స్టర్ లు గా నిలిచాయి. అంతే కాకుండా మ‌రి కొన్ని సినిమాలకు కూడా చిన్ని కృష్ణ క‌థ‌లు అందించారు.

Visitors Are Also Reading