Home » Undavalli Arun Kumar : ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌ధానే చెప్పారు..ఆ స‌మ‌యంలో..!

Undavalli Arun Kumar : ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌ధానే చెప్పారు..ఆ స‌మ‌యంలో..!

by Anji
Ad

ఏపీ విభ‌జ‌న‌పై మ‌రొక‌సారి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండు వ్యాఖ్యానించార‌ని పేర్కొన్నారు. జ‌మ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొల‌గించేట‌ప్పుడు.. ఆ త‌రువాత 2022 బ‌డ్జెట్ స‌మావేశాల్లో మోదీ.. ఏపీ విభ‌జ‌న రోజు బ్లాక్ డే అంటూ పేర్కొన్నారు అని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Also Read :  చంద్ర‌బాబు కుటుంబానికి సంబంధించిన‌ భూమి క‌బ్జా..?

Advertisement

2018లో మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబును క‌లిసి చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. దీనిపై చ‌ర్చ కొన‌సాగాల‌ని కోరాల‌ని సూచించిన‌ట్టు గుర్తు చేసారు. ఆ త‌రువాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దీనిపై లేఖ రాసిన‌ట్టు అరుణ్ కుమార్ వెల్ల‌డించారు. చంద్ర‌బాబు స్పందించ‌డం లేద‌ని.. మీరైనా దీని గురించి పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని సీఎం జ‌గ‌న్‌కు గుర్తు చేసిన‌ట్టు తెలిపారు.

Advertisement

మోదీ, అమిత్‌షా ఏపీ విభ‌జ‌న‌పై ఏమి మాట్లాడారో సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిన‌ట్టు అరుణ్ కుమార్ వెల్ల‌డించారు. కోర్టుకు కీల‌క ఆధారాలు స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్ ప్ర‌భుత్వాలు దీనిపై ఏమి చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. మ‌ళ్లీ అర్జెంట్ హియ‌రింగ్ కింద పిటీష‌న్ వేసిన‌ట్టు తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయం మ‌రెక్క‌డ జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు. ఇంత‌టి దారుణ‌మైన విభ‌జ‌న గురించి ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా మాట్లాడాల‌ని సూచించారు. ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న‌, పోల‌వ‌రం, వంటి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.

Also Read :  అర్థరాత్రి పోలీస్ స్టేష‌న్‌లో ఎంపీ హల్‌చ‌ల్

Visitors Are Also Reading