తెలుగులో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన కామెడీ షోలలో జబర్దస్త్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే జబర్దస్త్ లోని టాప్ కమియన్ లలో హైపర్ ఆది కూడా ఒకరు. హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ షో సక్సెస్ లో భాగం అయ్యారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆది పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Advertisement
ఈ సంధర్బంగా జబర్దస్త్ నుండి చంద్ర మరియు నాగబాబు వెళ్లిపోవడానికి కారణాలను కూడా చెప్పారు. జబర్దస్త్ తో పాటూ ఇతర కామెడీషోలు కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని అన్నారు. తాను నాగబాబుతో వెళ్లలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. అక్కడ ఉన్న కొంతమంది వల్లనే తాను నాగబాబుతో వెళ్లలేదని చెప్పారు. కానీ తను నాగబాబుతో ఎప్పుడూ కాంటాక్ట్ లో ఉంటానని చెప్పారు. నాగబాబు ఎంపీగా పోటీ చేసినప్పుడు తాను కూడా ఆయనతో పాటూ నరసపురంలో పర్యటించానని చెప్పారు.
Advertisement
కొన్ని విషయాలు జరిగాయని వాటిని బయటకు చెప్పలేనివని అన్నారు. ఆ కారణంగానే చంద్ర,నాగబాబు, ఆర్పీ అదిరింది షోకు వెళ్లారని చెప్పారు. హైపర్ ఆది మాటలు చూస్తుంటే జబర్దస్త్ లో ఏదో పెద్దగానే జరిగిందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇక తాను బీటెక్ చదివానని బీటెక్ లో ఈసీఈ చేశానని చెప్పారు.
జబర్దస్త్ నుండి తాను బయటకు వెళ్లాలని అనుకుంటే ఎక్కడైనా రానించగలను అనే నమ్మకం ఉందని అన్నారు. తను ఓ యేడాదిలో పెళ్లి చేసుకుంటానని అన్నారు. తాను స్కిట్ లలో సీనియర్ ఆర్టిస్ట్ లను కొత్త వారిని తీసుకురావడానికి కారణం జబర్దస్త్ ప్రారంభమై ఐదేళ్లు అయిందని కాబట్టి వారిని తీసుకువస్తున్నామని అన్నారు.