Home » Sujatha Rakesh : సుజాతా వెడ్స్ రాకేష్ …వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారా…?

Sujatha Rakesh : సుజాతా వెడ్స్ రాకేష్ …వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారా…?

by AJAY
Ad

ఈ మధ్య టెలివిజన్ షో లలో లవ్ స్టోరీ లో పెరిగిపోయాయి. మొదట్లో రష్మీ సుధీర్ ప్రేమలో ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రతి టీవీ షోలను ఇదే కంటిన్యూ అయింది. కొంతకాలంగా జబర్దస్త్ ఇమ్మాన్యూయేల్ వర్ష లవ్ లో ఉన్నారు అంటూ క్రియేట్ చేశారు. టీఆర్పీ రేటింగ్ రావడంతో పాటు ప్రేక్షకులు కూడా వీరిద్దరి మధ్య కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లో రాకేష్ సుజాత లు ప్రేమలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

Also read : చైసామ్ ల విడాకుల‌పై సుమంత్ షాకింగ్ కామెంట్స్..!

Advertisement

అయితే నిజానికి వీరిద్దరిది టిఆర్పి రేటింగ్ కోసం క్రియేట్ చేసిన ప్రేమ కాదని నిజంగానే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా ఇద్దరి వ్యవహారం చూస్తే కనిపిస్తోంది. రీసెంట్ ఎపిసోడ్ లో రాకేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తనకు సుజాత అంటే ప్రాణం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. తన తల్లి తర్వాత తల్లి సుజాత అంటూ ఎమోషనల్ డైలాగ్ లు కొట్టాడు. దాంతో రాకేష్ లోని ఎమోషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

అతను నిజంగానే సుజాతను ప్రేమిస్తున్నట్టు గా అర్థమవుతుంది. అంతేకాకుండా సుజాత కూడా తనకు తన తండ్రి అంటే ఇష్టం అని ఇప్పుడు రాకేష్ తన తండ్రి స్థానంలో ఉండి ప్రేమను పంచుతాడని నమ్మకం ఉంది అంటూ కామెంట్ చేసింది. అందుకే అతని ప్రేమను ఆస్వాదిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

దాంతో సుజాతకు కూడా రాకేష్ పై ప్రేమ ఉన్నట్టు అనిపిస్తోంది. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జబర్దస్త్ లో చాలా ఫేక్ లవ్ స్టోరీ ఉండటంతో వీరిది అయిన నిజమైన ప్రేమ కథా లేదంటే ఉత్త కథేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.

Visitors Are Also Reading