Home » చైసామ్ ల విడాకుల‌పై సుమంత్ షాకింగ్ కామెంట్స్..!

చైసామ్ ల విడాకుల‌పై సుమంత్ షాకింగ్ కామెంట్స్..!

by AJAY

మిడిల్ క్లాస్ ప్ర‌జ‌ల‌కు విడాకులు అంటే పెద్ద మ్యాట‌ర్ కానీ సెల‌బ్రెటీల‌కు విడాకులు చాలా విన్న‌షంలా క‌నిస్తుంటాయి. ఇక ఇటీవ‌ల కాలంలో ఇండ‌స్ట్రీలో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. గ‌తేడాది అక్టోబ‌ర్ లో స‌మంత నాగ‌చైత‌న్య విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత అక్కినేని కుటుంబానికి ఇష్టం లేని సినిమాల్లోన‌టించ‌డం…హ‌ద్దులు దాటి నటించ‌డం వ‌ల్లే స‌మంత‌కు చైతూ విడాకులు ఇచ్చార‌ని వార్త‌లు వినిపించాయి. మ‌రోవైపు విడాకుల‌కు చైతూ కార‌ణ‌మ‌ని మ‌రో హీరోయిన్ తో అఫైర్ కార‌ణంగానే ఇద్ద‌రూ విడాకులు తీసుకోవాల్సి వ‌చ్చింద‌నే వార్త‌లు కూడా జోరుగా వినిపించాయి.

ఇదిలా ఉంటే తాజాగా స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల‌పై హీరో సుమంత్ స్పందించారు. సుమంత్ కూడా అక్కినేని ఫ్యామిలీ మెంబ‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. కాగా రీసెంట్ గా సుమంత్ మ‌ళ్లీ మొద‌లైంది అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా కూడా విడాకుల నేప‌థ్యంలోనే తెర‌కెక్కింది. ఈ సినిమాలో సుమంత్ హీరోగా న‌టించారు.

samantha nagachaithanya

ఈ చిత్రం జీ5 లో విడుద‌ల‌య్యింది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సుమంత్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…..విడాకుల్లో ఓ మంచి ఏంటంటే స‌మంత నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ విడిపోయేట‌ప్పుడు బాధ‌ప‌డలేదు. వారిద్ద‌రి మంచి కోస‌మే ధైర్యంగా విడిపోయారు.  జరిగింది ఏదో జ‌రిగిపోయింది. అది కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఎంతో బాధించింది. స‌మంత చైత‌న్య మాత్రం విడిపోతున్నందుకు బాధ‌ప‌డ‌లేదు.

samantha-akkineni

samantha-akkineni

విడాకులు తీసుకోవ‌డం ఇద్ద‌రి మంచికే జ‌రిగిందంటూ సుమంత్ కామెంట్స్ చేశారు. ఇక విడాకుల అంశాన్ని మీడియా హైలెట్ చేయ‌డంలో కూడా త‌ప్పు లేదంటూ సుమంత్ వ్యాక్యానించారు. తాను మొద‌ట చైసామ్ విడాకుల వార్త విని షాక్ అయ్యాన‌ని కానీ వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింద‌ని అడ‌గలేద‌ని అది వారి ప‌ర్స‌న‌ల్ అని చెప్పారు.

Visitors Are Also Reading