రోడ్డు సేప్టీ విధానాలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాహనాలను అతివేగంగా నడపడం, అజాగ్రత్తగా నడపడం, రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్స్ ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తున్నట్టు సిగ్నల్ కూడా పడింది. అప్పటికీ గేట్ మ్యాన్ గేటును క్లోజ్ చేశాడుప కానీ ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా రైలు వచ్చే లోపు క్రాస్ చేసి వెళ్లవచ్చని అనుకున్నాడు. రూల్స్‌ను బ్రేకు చేసి బైకును ముందుకు తీసుకెళ్లాడు.
Also Read : ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్స్.. ఇప్పుడు ఏమి చేస్తున్నారంటే..?
Advertisement
Advertisement
రాజధాని ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకురావడం గమనించిన ఆ వ్యక్తి బైకును అక్కడే వదిలేసి వెనక్కి వచ్చాడు. రాజధాని ఎక్స్‌ప్రెస్ బైకును బలంగా ఢీ కొట్టడంతో బైకు ముక్కలు మక్కులు అయింది. బైకు నడిపిన వ్యక్తి మాత్రం సురక్షితంగానే బయటపడ్డాడు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రూల్స్ పాటించాలని, పాటించకుంటే ఏమి జరుగుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఘటనను మీరు కూడా చేసెయ్యండి.
https://twitter.com/rajtoday/status/1493129784314175489