Telugu News » ఒక‌ప్పుడు టాలీవుడ్ ల‌వ‌ర్ బాయ్స్‌.. ఇప్పుడు ఏమి చేస్తున్నారంటే..?

ఒక‌ప్పుడు టాలీవుడ్ ల‌వ‌ర్ బాయ్స్‌.. ఇప్పుడు ఏమి చేస్తున్నారంటే..?

by Anji

ఒక‌ప్పుడు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ల‌వ‌ర్ బాయ్స్ గా పేరు తెచ్చుకుని వ‌రుస సినిమాల‌తో మంచి పేరు సంపాదించుకున్న టాలెంటెడ్  హీరోస్ ప్ర‌స్తుతం సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయిన హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

Also Read :  ఎన్టీఆర్ కండిష‌న్‌ను బ్రేక్‌ చేసిన కైకాల‌ స‌త్య‌నారాయ‌ణ.. ఎందుకో తెలుసా..?

Tarakarathna

Tarakarathna

నంద‌మూరి కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలు సీనియ‌ర్ ఎన్టీఆర్ పేరు నిల‌బెడుతూ స్టార్లుగా నిలబ‌డింది ముగ్గురే. అందులో ఒక‌రు బాల‌య్య‌, మ‌రొక‌రు జూనియ‌ర్ ఎన్టీఆర్ తో పాటు క‌ల్యాణ్ రామ్ కూడా ప్ర‌త్యేక‌మైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు. నంద‌మూరి కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో తార‌క‌ర‌త్న స‌క్సెస్ కాలేక‌పోయాడు. ఆయ‌న చేసిన సినిమాల్లో ఒక్క‌టీ కూడా విజ‌యం సాధించ‌లేదు. తార‌క‌ర‌త్న హీరోగా చేయ‌డ‌మే మానేశాడు. ఈ హీరో మాత్రం ఒకేసారి 9 సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించాడు.

Tarun

Tarun

అల‌నాటి న‌టి రోజా ర‌మ‌ణి, చ‌క్ర‌పాణి దంప‌తుల త‌న‌యుడు త‌రుణ్ బాల‌న‌టుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌రుణ్ హీరోగా మొద‌టి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇండ‌స్ట్రీలో అస‌లైన ల‌వ‌ర్ బాయ్‌గా గుర్తింపు పొంది అమ్మాయిల పాలిట క‌ల‌ల రాకుమారుడిగా వెలుగొందాడు. వ‌రుస హిట్ల‌ను అందుకున్న త‌రుణ్‌ను త‌రువాత వ‌రుస ప‌రాజ‌యాలు వెంటాడుతుండ‌టంతో గ‌త కొంత‌కాలంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటున్నాడు.

Also Read :  My Story నాకు 40., త‌న‌కు 20.! ఇది మా స్టోరి!

Venu

Venu

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో తొట్టెంపూడి వేణు అయితే చాలా కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు.

Vadde naveen

Vadde naveen

సెంటిమెంట్ హీరోగా స్పెష‌ల్ మేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వ‌డ్డే న‌వీన్ అయితే చాలా కాలంగా న‌వీన్ సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు.

Akash

Akash

ఇక హీరో ఆకాశ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రమే లేదు. ఆనందం వంటి మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్ త‌ర్వాత తెలుగులో వ‌రుస పెట్టి సినిమాలు చేశాడు. హీరోగా అత‌నికి మంచి విజ‌యాలు ద‌క్క‌లేదు. త‌న‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన త‌మిళ ఇండ‌స్ట్రీ వైపు వెళ్లారు.

Arun Kumar

Arun Kumar

దాస‌రి నారాయ‌ణ‌రావు పేరు తెలియ‌ని వాళ్లు ఉండ‌రనే చెప్పాలి. అయితే దాసరి కుమారుడుగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అరుణ్‌కుమార్ కొన్ని సినిమాల త‌రువాత సినీ ప్ర‌పంచానికి దూరంగా ఉంటున్నారు.

Raja

Raja

ఓ చిన్న‌దాన సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆనంద్ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా మాత్ర‌మే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాజా మెప్పించారు. అయితే ఎన్నో క‌ల‌ల‌తో సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన రాజా ఇక్క‌డ ఇమ‌డ‌లేక‌పోయారు. కొన్నాళ్లు బ్ర‌ద‌ర్‌గా చేశారు.

Raja Goutham

Raja Goutham

కామెడీ కింగ్ బ్ర‌హ్మ‌నందం పెద్ద కుమారుడు రాజా గౌత‌మ్ ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. డిఫ‌రెంట్ సినిమాలు చేసి న‌టుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. కానీ క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ అందుకోలేదు.

Sai Ram Shankar

Sai Ram Shankar

సాయిరాం శంక‌ర్ హీరోగానే కాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించారు. టాలీవుడ్‌లో గ‌తంలో రూపొందించిన బంప‌ర్ ఆఫ‌ర్ చిత్రం ఆయ‌న‌కు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ మ‌ధ్య‌కాలంలో అవ‌కాశాలు త‌గ్గిపోయిన ఇండ‌స్ట్రీలోనే సినిమాల‌ను ట్రై చేస్తూ ఇప్పుడు బంప‌ర్ ఆఫ‌ర్ 2కు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Also Read :  దామోద‌రం సంజీవ‌య్య : దేశంలోనే తొలి ద‌ళిత సీఎం రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి మీకు తెలుసా..?


You may also like