దైవ దర్శనం కోసం వాళ్లు టైగర్ రిజర్వ్‌లోకి వెళ్లారు కానీ అనుకోకుండా వాళ్లకు పెద్దపులి ఎదురు అయింది. ప్రాణభయంతో వణికిపోయారు. బైకుపై వచ్చిన వాళ్లు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. చెట్టు కింద పులి, చెట్టుమీద ఇద్దరు యువకులు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ఎన్టీఆర్ : నష్టం వచ్చినా పర్వాలేదు ఆ సినిమా చేద్దాం
Advertisement
Advertisement
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చాతర్‌పూర్‌లో చోటు చేసుకుంది. పననా టైగర్ రిజర్వ్‌లోని ఆలయాన్ని సందర్శించేందుకు ఏడాదిలో ఒకసారి అనుమతిస్తారు. ఆ యువకులు దైవదర్శనం కోసం టైగర్ రిజర్వ్ లోకి వెళ్లారు. అదే సమయంలో దారిల పులి ఎదురుకావడంతో వాళ్లు చెట్టు ఎక్కారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను కాపాడారు. దీంతోఓ బ్రతుకు జీవుడా అంటూ ఆయువకులు అక్కడ నుంచి జారుకున్నారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు గుడికి వెళ్లకముందే దేవుడు కనిపించాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం..!