టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ముఖ్యంగా ఆయన ఏదైనా అనుకున్నారంటే అది పూర్తయ్యే వరకూ నిద్రపోయే వారు కాదు. సినిమా విషయంలో ఆయన ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవారు. పనిపట్ల ఆయనకు ఉన్న అంకిత భావానికి దర్శక నిర్మాతలే కాదు, తోటి నటీనటులు సైతం ఆశ్చర్యపోయేవారు. అందుకే ఆయన సెట్లో ఉన్నారంటే అంతా భయంతో వణికిపోయేవారు. జానపదం, పౌరాణికం, సాంఘికం ఇలా జోనర్ ఏదైనా ఆ పాత్రల్లో ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు.
Also Read : సినిమాల్లోకి రాకముందే బిత్తిరి సత్తికి అన్ని ఆస్తులున్నాయా…!
ఏదైనా కొత్త పాత్ర చేయాలని సంకల్పిస్తే.. అస్సలు వెనకడుగు దేయరు. అలాంటిదే ఈ సంఘటన ఎన్టీఆర్ శ్రీనాథుడి కథను చిత్రంగా తీయాలనుకున్నారు. ఈ విషయాన్ని బాపు రమణల దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్లు శ్రీనాథుడి జీవితంలో పెద్ద కథేం ఉండదు. సామాన్యులకి ఆయన ఎవరో తెలియదు. అది సినిమా తీయడం అంటే ఇబ్బందే. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందేమో అని అన్నారు.
ఏమి పర్వాలేదు. నష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు, మనం నిష్టగా కచ్చితమైన శ్రద్ధతో సినిమా తీద్దాం. ప్రజాదరణ పొందకపోయినా ఇబ్బంది లేదు. కొందరు అయినా ఆ సినిమా చూస్తారు. ఆ తృప్తి చాలు, ఏమైనా శ్రీనాథుడి పాత్ర ధరించాలనేది నా కోరిక అంతే అని అన్నారట. ఎన్టీఆర్ ఆ తరువాత బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్, జయసుధ జంటగా శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రం తెరకెక్కినది. కేవీ మహదేవన్ బాణీలను అందించారు.
Also Read : అందరికంటే మోహన్ బాబు మిన్న..ఆయనే పెద్దదిక్కు : నరేష్