ప్రస్తుతం ప్రపంచం ఆధునీకరణ వైపు పరుగులు పెడుతున్నా మారుమూల ప్రాంతాలలో కులవివక్ష జాడ్యం తన ఉనికి చూపుతూనే ఉన్నది. తమ కంటే తక్కువ కులానికి చెందిన వారని, ఒకేకులంలో ఏర్పడే విభేదాలు మానవ సంబంధాలను చెరిపేస్తోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేకెత్తించింది. ఖోడద్ గ్రామంలోని 12 మత్స్యకార కుటుంబాలపై సంఘం పెద్దలు కుల బహిష్కరణ వేటు వేశారు. మూడేండ్లుగా నరకం చూసిన బాధితులు, వేధింపులు తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని మీడియాను కోరుతున్నారు. ఈ ఘటనపై మీడియా కుల పెద్దలను వివరణ కోరగా.. వారి నుంచి నిర్లక్ష్య పూరితమైన సమాధానం రావడం విశేషం.
Also Read : సీరియల్స్ ను ఎందుకు సాగదీస్తారు..? దానివల్ల ఉపయోగమేంటి..!
Advertisement
Advertisement
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 12 మత్య్సకార కుటుంబాలపై సంఘం పెద్దలు కుల బహిష్కరణ వేటు వేసారు. గ్రామంలో 72 కుటుంబాల్లో 12 కుటుంబాలను వెలివేశారు. వారు శుభకార్యాలకు, చావులకు వెళ్లకూడదు అని సంఘం పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువయ్యాయని, మూడేళ్లుగా నరకం చూస్తున్నామని బాధితులు ఆశ్రయించారు.
కుల బహిష్కరణ విషయంలో ఖోడద్ మత్స్యకార సంఘం పెద్దలను ఆరా తీయగా.. తాము వారిని కుల బహిష్కరణ చేయలేదని, సంఘం భవనం నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని, అందుకే ఆ 12 కుటుంబాలను దూరంగా ఉంచామని చెప్పారు కులంలో తిరిగి చేరాలంటే జరిమానా చెల్లించాల్సిందేనని వెల్లడించడం గమనార్హం.
Also Read : ఎన్టీఆర్ : నష్టం వచ్చినా పర్వాలేదు ఆ సినిమా చేద్దాం