ఒకప్పుడు వార్తలు అంటే ఓ న్యూస్ రీడర్ వచ్చి చదివి వెళ్లిపోయేవాళ్లు. కానీ కొంతమంది వల్ల అలాంటి సంస్కృతికి చెక్ పడింది. ఇప్పటికీ న్యూస్ రీడర్ లు న్యూస్ చదువుతున్నా..కేవలం 30 నిమిషాల్లో వినోదం పంచుతూనే టాప్ వార్తలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. అయితే అలా ఇంట్రెస్టింట్ గా న్యూస్ చెప్పడం తీన్మార్ అనే న్యూస్ షో లో మల్లన్న తో ప్రారంభం అయ్యింది. ఇక మల్లన తరవాత మళ్లీ అంతకంటే ఎక్కువ గుర్తింపు బిత్తిరి సత్తికి వచ్చింది. తీన్మార్ న్యూస్ లో చేవెళ్ల రవి బిత్తిరి సత్తి లా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Advertisement
అమాయకుడి బిత్తిరి కలిగిన వ్యక్తిలా రవి చాలా బాగా నటించాడు. నటిస్తున్నాడా లేదంటే ఇదే ఒరిజినల్ క్యారెక్టరా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అప్పట్లో తీన్మార్ న్యూస్ వస్తుందంటే బిత్తిరి సత్తి ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూసేవారు. అలా బిత్తిరి సత్తి అలియాస్ రవి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలా వచ్చిన పాపులారీతో ప్రస్తుతం సినిమాలు మరియు టీవీ షోలు చేస్తున్నాడు.
Advertisement
నిజానికి చేవెళ్ల రవి మొదటగా మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ పెద్దగా గుర్తింపురాలేదు. కానీ బిత్తిరి సత్తి మ్యానరిజం తో ఎంతో పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాను పేద కుటుంబం నుండి వచ్చానని రవి చెప్పగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అతడికి ముందే చాలా ఆస్తులు ఉన్నాయని మహబూబ్ నగర్ లో చాలా ఎకరాల భూములు ఉన్నాయని ప్రచారం చేశాయి.
కాగా ఆ కామెంట్లపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిత్తిరి సత్తి స్పందించారు. తమది వెనకబడిన ప్రాంతమని పది ఎకరాలు ఉంటే కోటీశ్వరులు కాదని అన్నారు. నీటి వసతి సరిగ్గా ఉండదని తన కుటుంబంలో అందరూ వ్యవసాయ పనులకు వెళతారని అన్నారు. నీటి వసతుల్లేని భూములు పంటలు పండవని అన్నారు. తనది పేద కుంటుంబమని చెప్పారు.