Home » Samantha : నాగ చైతన్య మొదటి భార్య అదే…సమంత సెన్సేషనల్ కామెంట్స్…!

Samantha : నాగ చైతన్య మొదటి భార్య అదే…సమంత సెన్సేషనల్ కామెంట్స్…!

by AJAY
Ad

గతేడాది అక్టోబర్ లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఇద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు రాగా అక్టోబర్ 2న సమంత నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా తమ విడాకులకు అధికారికంగా ప్రకటించారు. దాంతో అభిమానులు అంతా షాక్ కు గురయ్యారు. అయితే నెలలు గడుస్తున్నా ఇద్దరి విడాకుల అంశం మాత్రం ఇంకా కూడా హాట్ టాపిక్ గానే ఉంది. తరచూ ఏదో ఒక విధంగా సమంత నాగచైతన్య విడాకుల అంశం వార్తల్లో నిలుస్తోంది.

Samantha : అమ్మ రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన 6 సినిమాలు- వాటి రిజ‌ల్ట్స్!

Advertisement

అయితే సమంత మంచు లక్ష్మి టాక్ షో లో నాగ చైతన్య గురించి చెప్పిన కొన్ని విషయాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంచు లక్ష్మి ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అని ప్రశ్నించగా…. నాగచైతన్య ఒక హస్బెండ్ మెటీరియల్ అంటూ సమంత స్పందించింది. తన వద్ద ఇంటికి ఫోన్ చేయడానికి కూడా డబ్బులు లేని స్థితి నుండి నాగచైతన్య చూసాడని చెప్పింది. అప్పుడు నాగచైతన్య ఫోన్ తీసుకుని తాను ఇంటికి ఫోన్ చేశానని తెలిపింది.

Advertisement

పెళ్లికి ముందు కొంత కాలం డేటింగ్ చేసినట్టు కూడా ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఇదే షోలో మంచు లక్ష్మి సమంతకు ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. మీ బెడ్ రూమ్ లో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ను చెప్పాలి అంటూ ప్రశ్నించింది. దానికి సమంత స్పందిస్తూ నాగ చైతన్య మొదటి భార్య పిల్లోనే అంటూ సమాధానం ఇచ్చింది.

samantha

samantha

ఇద్దరి మధ్యలో ఉన్న పిల్లోను తాను ముద్దు పెట్టుకున్నా కూడా నాగచైతన్య ఒప్పుకునే వాడు కాదని సమంత పేర్కొంది. ఇక చాలు ఇక ఇప్పటికే చాలా విషయాలు చెప్పేసాను అంటూ సమంత అక్కడితో ఆపేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదిలాఉండగా సమంత నాగచైతన్య మళ్లీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ వీరిద్దరూ ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు.

Visitors Are Also Reading