సినిమా ఇండస్ట్రీ మూలంగా వేలాది మంది బతుకుతున్నారు. విజువల్ ఇంఫాక్ట్ కోసం, విజువల్ స్పెక్టాక్యులర్ కోసం విజువల్స్ ఉంటేనే జనాలు థియేటర్ వద్దకు వెళ్లి చూడాలనే మూడులో లేరు అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలను ఎప్పుడు మేము గౌరవిస్తాం అని మెగాస్టార్ చెప్పారు. పేద ప్రజలకు ఏదైనా సరే వారికి అందుబాటులో ఉండాలి. అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో వేల మంది పేదలు బతుకుతున్నారు కాబట్టి ఇండస్ట్రీలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా అవే రిటర్న్స్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకుని మేము అందరం కలిసి చర్చించుకున్నట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లారు చిరంజీవి.
ఎగ్జిబిట్ రంగానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషిస్తున్నామని చిరంజీవి పేర్కొన్నారు. ఇందులో ఎవ్వరూ విభేదించేది లేదు. వారందరి మాటగా సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్న నిర్ణయాలు, టికెట్ల ధర విషయం, క్యాటగిరిల వారిగా విభజించిన విధానం అందరికీ ఆనందమైన విషయం. అదేవిధంగా బడ్జెట్ పెరుగుతుందని.. ముఖ్యంగా సినిమా థియేటర్‌కు ఆడియెన్స్ రప్పించడానికి ఎక్స్ ట్రాగా కొన్ని ఫీట్స్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ ట్రా ఖర్చు చేయాల్సి వస్తుంది. చిన్న సినిమాలకు ప్రత్యేకమైన ఆర్.నారాయణమూర్తి ఐదవ షో ఉండాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి కోరికను నెరవేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
Advertisement
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి శ్రమ పెరుగుతుంది
Advertisement
అదేవిధంగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు మాట్లాడుతూ..సినిమా ఇండస్ట్రీ గురించి ప్రభుత్వం స్పందించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పారు మహేష్‌బాబు. అదేవిధంగా దర్శకుడు రాజమౌళి ఆంధప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సగటు సినిమా మనుగడ లేకుండా పోయింది. సినిమాలను బతికించండి అంటూ రెండు చేతులు జోడించి ఆర్.నారాయణమూర్తి సీఎం జగన్‌ను వేడుకున్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ సీఎం జగన్ చాలా సమయం ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను తెలిపాం. ఆయన అర్థం చేసుకున్నారు. చిరంజీవికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. 7, 8నెలల నుంచి చాలా కన్ప్యూజన్లో ఉన్నాం. చిరంజీవి వచ్చి ఈ సమస్యకు ఒక ఫినిషింగ్ ఇచ్చారు. చిరంజీవి వల్లనే ఇది సాధ్యమైంది. పేర్ని నానికి థాంక్స్ సర్ అని చెప్పారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఫిబ్రవరి మూడవ వారం లోపు శుభం కార్డు పడనున్నదని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు.
చిన్న సినిమాలకు ఎక్కువ సమయం పెట్టండి. చిన్న సినిమాలను బతికించండి అని పోసాని కృష్ణమురళి సీఎం జగన్‌ను కోరారు. అదేవిధంగా ఆలీ మాట్లాడారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు థియేటర్లు ఇప్పించండి. ఇంతకు ముందు ఒక సినిమా 50 రోజులు, 100 రోజులు ఆడేది. కేవలం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్ అయినా హిట్ అయితే పెద్దస్టార్, ప్లాప్ అయితే నో మోర్. అట్లాంటిది ఈ ఇండస్ట్రీలో వేలాది మంది టెక్నిషియన్లున్నారు. టెక్నిషియన్ల గుండెల్లో మీరుండిపోతారు అని పేర్కొన్నారు.