Home » Harish Rao : తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే కుట్ర

Harish Rao : తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే కుట్ర

by Anji
Ad

రాష్ట్ర విభ‌జ‌న‌పై రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ వైద్యారోగ్య‌, ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ముఖ్యంగా ప్ర‌ధాని తెలంగాణ రాష్ట్రంపై మ‌రొక‌సారి త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కార‌ని, అమ‌రుల త్యాగాల‌ను కించ‌ప‌రిచార‌ని మండిపడ్డారు. మోడీ వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తే తెలంగాణ‌ను మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపే కుట్ర చేస్తున్న‌ట్టు అనిపిస్తోంద‌ని మంత్రి హ‌రీశ్ రావు ఆరోపించారు.

Also Read :  ప్రేమ‌దేశంలో అబ్బాస్‌కు ఛాన్స్ ఏ విధంగా వ‌చ్చిందో తెలుసా..?

Advertisement

తెలంగాణ‌ రాష్ట్ర సాధ‌న కోసం వేలాది మంది ప్రాణాలు అర్పించార‌ని, ఆ అమ‌రుల త్యాగాల‌ను మోడీ అవ‌మానిస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. తెలంగాణ‌పై విషం చిమ్మ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో బీజేపీకి నూక‌లు చెల్లాయ‌ని, తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇక్క‌డి బీజేపీ నేత‌లు ఎలా స‌మ‌ర్థించుకుంటార‌ని ఆయ‌న నిల‌దీశారు.

Advertisement

బీజేపీ ఎన్ని కుట్ర‌లు చేసినా తెలంగాణ పురోగ‌తి సాధిస్తుంద‌ని చెప్పారు. దేశంలో ఎంపీలు ద‌త్త‌త తీసుకున్న టాప్‌-10 గ్రామాల్లో బెస్ట్ ఏడు గ్రామాల అవార్డులు తెలంగాణకే వ‌చ్చాయ‌ని.. త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరుకు ఇదే నిద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు. వ‌ల‌స కార్మికుల వ‌ల్లే క‌రోనా వ‌చ్చింద‌ని మోడీ మాట్లాడ‌టం సిగ్గు చేటు అన్నారు. కుంభ‌మేళా నిర్వ‌హించినప్పుడు ట్రంప్ స‌భ‌లు, రోడ్డు షోలు నిర్వ‌హించిన‌ప్పుడు క‌రోనా పెర‌గ‌లేదా అని ప్ర‌శ్నించారు హరీశ్‌రావు.

Also Read :  ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా చూసి బ‌య్య‌ర్లు నిద్ర పోయార‌ట‌.. కానీ ఆ సినిమా ఫ‌లితం ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading