Home » హైద‌రాబాద్ బౌల‌ర్ సిరాజ్‌ను అప్పుడు అంత‌లా దూషించార‌ట‌..!

హైద‌రాబాద్ బౌల‌ర్ సిరాజ్‌ను అప్పుడు అంత‌లా దూషించార‌ట‌..!

by Anji
Ad

భార‌త్ లో క్రికెట్ ఓ మతం. క్రికెట్ ఆడే వారిని అభిమానులు న‌చ్చితే త‌ల‌కెత్తుకుంటారు. న‌చ్చ‌లేదో స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదో పొగిడిన నోటితోనే తిట్ల పురాణం చ‌దువుతారు. వారు ఊరికే విమ‌ర్శ‌లు చేయ‌డం మాత్ర‌మే కాకుండా డైరెక్ట్‌గా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తూ స‌ద‌రు క్రికెట‌ర్‌ను ట్యాగ్ చేస్తారు. అంతేకాకుండా ఒక్కోసారి తిట్టిన క్రికెట‌ర్ అనే పొడుగుతున్నారు. ఇదే విష‌యం జ‌రిగింద‌ని చెబుతున్నారు. టీమిండియా న‌యా సంచ‌ల‌నం హైద‌రాబాదీ ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ విష‌యంలో ఏమి జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ALSO READ :  బుల్లి తెర నుంచి వెండి తెర‌పైకి వ‌చ్చిన టాలీవుడ్ సెలబ్రెటిస్ వీరే..!

Advertisement

మ‌హ్మ‌ద్ సిరాజ్ 2017లోనే న్యూజిలాండ్ లో టీ-20 ల ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రి ఇచ్చాడు. కానీ అప్పుడు అత‌డు దారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఆ సిరిస్ త‌రువాత జ‌రిగిన 2018 సీజ‌న్ ఐపీఎల్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ త‌రుపున ఆడిన సిరాజ్ త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అత‌నిపై దారుణ ట్రోలింగ్ చేశారు. కొంద‌రు అయితే సిరాజ్‌ను మీ నాన్న లాగా నువ్వు కూడా ఆటో న‌డుపుకో అని అన్నార‌ట‌. తాజాగా ఈ విష‌యాల‌ను గుర్తుచేసుకుని సిరాజ్ భావోద్వేగానికి గుర‌య్యారు.

Advertisement

ALSO READ :  స‌మ్మ‌క్క భ‌క్తుల‌కు గుడ్ న్యూస్..ఇలా చేస్తే ఇంటి వ‌ద్ద‌కే ప్ర‌సాదం..!

సిరాజ్ తండ్రి హైద‌రాబాద్‌లో ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూ ఉండేవాడు. కానీ సిరాజ్ ఆ వ్యాఖ్య‌ల‌కు కుంగిపోలేదు. దుర‌దృష్ట‌వ‌శాత్తు సిరాజ్ ఆసీస్‌లో ఉన్న స‌మ‌యంలోనే అత‌ని తండ్రి హైద‌రాబాద్‌లో మ‌రణించాడు. కానీ సిరాజ్ మాత్రం టెస్ట్ సిరీస్ చేయ‌బ‌ట్టి రాలేక‌పోయాడు. అదే సిరీస్‌లో గ‌బ్బా వేదిక‌గా టెస్ట్‌ల్లోకి ఆరంగ్రేటం చేసిన సిరాజ్ త‌న స‌త్తాను చాటాడు. ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించారు. సిరాజ్‌తో పాటు మిగ‌తా వారు కూడా రాణించ‌డంతో ఆ సిరీస్‌ను ఇండియా కైవ‌సం చేసుకుంది.

అదేవిదంగా కొంద‌రూ దారుణంగా ట్రోల్ చేశార‌ని మ‌హ్మ‌ద్ సిరాజ్ పేర్కొన్నారు. ముఖ్యంగా 2018లో నేను కేకేఆర్‌తో ఆడేట‌ప్పుడు రెండు బీమ‌ర్లు వేశాను. దీంతో నువ్వు క్రికెట్ వ‌దిలేసి మీ నాన్న‌తో క‌లిసి ఆటో న‌డుపుకో అంటూ చాలా మంది కామెంట్లు చేసారు. నేను టీమిండియాకు సెలెక్ట్ కాగానే.. ఎవ‌రి మాట విన‌వ‌ద్ద‌ని, ఇవాళ రాణిస్తే పొగిడిన వాళ్లే రేపు విఫ‌లం చెందితే తిడ‌తారు అని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్‌.ధోని చెప్పాడ‌ని గుర్తు చేశాడు. ముఖ్యంగా అప్పుడు ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు వావ్ సిరాజ్ అంటున్నార‌ని సిరాజ్ చెప్పాడు.

Visitors Are Also Reading