Home » స‌మ్మ‌క్క భ‌క్తుల‌కు గుడ్ న్యూస్..ఇలా చేస్తే ఇంటి వ‌ద్ద‌కే ప్ర‌సాదం..!

స‌మ్మ‌క్క భ‌క్తుల‌కు గుడ్ న్యూస్..ఇలా చేస్తే ఇంటి వ‌ద్ద‌కే ప్ర‌సాదం..!

by AJAY
Ad

ఆసియాలోనే అతిపెద్ద జాత‌ర‌గా మేడారం జాత‌ర ప్ర‌సిద్ది చెందింది. మూడేళ్లకు ఒక‌సారి వ‌చ్చే ఈ జాత‌ర కోసం తెలుగురాష్ట్రాల‌తో పాటూ చ‌ట్టుప‌క్క‌రాష్ట్రాల నుండి కూడా భ‌క్తులు వ‌స్తుంటారు. దాంతో భ‌క్తుల ర‌ద్దీ భారీగా ఉంటుంది. కిలోమేట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక ఈ యేడాది కూడా మేడారం జాత‌ర ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. దాంతో తెలంగాణ ప్ర‌భుత్వం జాత‌ర కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. ఇక భక్త‌ల ర‌ద్దీ నేప‌థ్యంలో క‌రోనా నేప‌థ్యంలో కొంత‌మంది జాత‌ర‌కు వెళ్ల‌లేక‌పోతారు.

Advertisement

అలాంటి వారి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ మ‌రియు త‌పాలా శాఖ‌ల ద్వారా భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. మేడారం ప్ర‌సాదాన్ని పంపిణీ చేసేందుకు ఆర్టీసీ మ‌రియు త‌పాల‌శాక‌ల స‌హ‌కారం తీసుకున్నామ‌ని చెప్పారు. దాంతో ప్ర‌సాదం ఇంటివ‌ద్ద‌కే డోర్ డెలివ‌రీ అవుతుంద‌ని చెప్పారు.

Advertisement

అంతే కాకుండా బెల్లం-బంగారం ను మేడారం పంపి మొక్కు చెల్లించుకోవాల‌నుకునేవారికోసం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. బెల్లం పంపాల‌నుకునేవారి ఇంటివ‌ద్ద‌కే ఆర్టీసీ సంస్థ‌కు చెందిన వ్య‌క్తులు వ‌చ్చి బెల్లం తీసుకుని మొక్కులు చెల్లించి మ‌ళ్లీ తిరిగి ప్ర‌సాదం అంద‌జేస్తార‌ని చెప్పారు. ఇక ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకునేవారు మీసేవ ద్వారా లేదా టీయాప్ ఫోలియో యాప్ ద్వారా అప్లై చేసుకోవాల‌ని చెప్పారు.

అంతే కాకుండా 200గ్రాముల ప్ర‌సాదం రూ.225 చెల్లించాల్సి ఉంటుంద‌ని అన్నారు. ప్ర‌సాదంతో పాటూ అమ్మ‌వారి ఫోటో ప‌సుపు మరియు కుంకుంమ భ‌క్తుల‌కు అందుతుంద‌ని చెప్పారు. ఇక ఫిబ్ర‌వ‌రి 12 నుండి 22వ‌ర‌కూ భ‌క్తుల‌కు ఈ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Visitors Are Also Reading