Home » దేవాల‌యాల్లో చేయ‌కూడ‌ని ప‌నులు ఏవో తెలుసా..?

దేవాల‌యాల్లో చేయ‌కూడ‌ని ప‌నులు ఏవో తెలుసా..?

by Anji
Ad

భార‌త‌దేశంలో దేవుడు అనే ప‌దానికి ఎంతో విశిష్ట‌త ఉంది. మ‌నం ఎక్కువ‌గా నిష్ట‌గా ఉండేది దేవుడి పేరు మీద‌నే. దేశంలో వేల ఏండ్ల నుంచి దేవుళ్ల‌కు, దేవాల‌యాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన ఘ‌న‌త ఉంది. ముఖ్యంగా దేవాల‌యాల్లో దేవున్ని ద‌ర్శించుకునేట‌ప్పుడు కొన్ని పాటించేవి, పాటించ‌న‌నివి ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Things that not to do in temples - Manamnews.com

Things that not to do in temples – Manamnews.com

దేవాల‌యాలు ప్లాన్ ప్ర‌కారం.. నిర్మించిన‌టువంటి శ‌క్తి క్షేత్రాలు దేవాలయాల్లో కొన్ని గుళ్లు సిద్ధ పురుషులు కొంత మంది రాజులు నిర్మించిన‌వి మాత్ర‌మే ఉన్నాయి. ఆ స‌మ‌యంలో వారు వారి సంతానం కోస‌మో, వారి విజ‌యానికి చిహ్నంగానే ఏదో ఒక విధంగా నిర్మించ‌బ‌డ్డ క్షేత్రాలు అవి. ధ్వ‌జ‌స్థంభం, అదేవిధంగా గోపురం ఉన్నటువంటి దేవాల‌యాల్లో మ‌నం త‌ప్పకుండా కొన్ని విధుల‌ను పాటించాలి. మ‌నం ఏదైనా శైవ క్షేత్రాల‌కు వెళ్లిన‌ప్పుడు వాహ‌నంతో కానీ, చెప్పుల‌తో కానీ లోప‌లికి అస్స‌లు వెళ్ల‌కూడ‌దు.

Advertisement

Advertisement

Things that not to do in temples - Manamnews.com

Things that not to do in temples – Manamnews.com

 

అదేవిధంగా ఆయుధాలు కూడా ధ‌రించి వెళ్ల‌కూడ‌దు. పూర్వం రాజులు కూడా ఆయుధాలు తీసి బ‌య‌పట పెట్టి ఆ త‌రువాత‌నే దేవాల‌యాల్లోకి వెళ్లేవార‌ట‌. ముఖ్యంగా నోట్లో ఏదైనా వేసుకుని న‌ములుతూ దేవాల‌యంలోకి అస్స‌లు వెళ్ల‌కూడ‌దు. ఆ ప్రాంగ‌ణంలోకి వెళ్లాక పూర్వం న‌మ‌ల‌డం త‌గ్గించాలి.

 

దేవాల‌యాల్లో ప‌ర‌నింద‌, ప‌ర‌స్తుతి చేయ‌కూడ‌దు. క్షేత్రాల్లో వివాదాల‌కు దిగ‌కూడ‌దు. ముఖ్య విష‌య‌మేమిటంటే గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ త‌రువాత‌నే దేవుడి ద‌ర్శ‌నం చేసుకోవాలి. ప్ర‌ద‌క్షిణ చేసే శ‌క్తి లేని వాళ్లు క‌నీసం ఒక్క ప్ర‌ద‌క్షిణ అయినా చేయాలి. స్త్రీలు ముఖ్యంగా జుట్టు వీరబోసుకోని దేవాల‌యం ద‌ర్శ‌నం చేసుకోకూడ‌దు. ద‌ర్శ‌నం చేసుకున్న త‌రువాత త‌ప్ప‌కుండా కొద్దిసేపు ఆ గుళ్లో ప్ర‌శాంతంగా కూర్చోవాలి. అదేవిధంగా కొన్ని దేవాల‌యాల్లో ద‌ర్శ‌న స‌మ‌యంలో నిద్రించ‌కూడ‌దు. కొన్ని నియమాలు పాటించి దేవాల‌యాల్లో ద‌ర్శ‌నం చేసుకుంటే మీకు ద‌ర్శ‌న బాగ్యం క‌లుగుతుంద‌ని చరిత్ర చెబుతోంది.

Also :  జూలో కోతి ముందు ఓ వ్యక్తి మ్యాజిక్.. కోతి రియాక్షన్ ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading