ఒకప్పుడు శరీరంపై చిన్నగా, సింపుల్‌గా పచ్చబొట్టు వేయించుకోవాలంటేనే భయపడిపోయేవారు. కానీ ఇవాళ శరీరంపై పెద్ద పెద్ద టాటూలు వేసుకుని తిరుగుతున్నారు. అంతేకాదు ఓ వ్యక్తి ఏకంగా టాటూలు వేచించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు.
Advertisement
ఈ వ్యక్తి పేరు మైఖేల్ అమోయా, ఇతను అమెరికాలోని న్యూయార్క్ నివాసి. తన శరీరంపై 864 క్రిమికీటకాల టాటూలు వేయించుకుని గిన్నిస్‌రికార్డును సృష్టించాడు.
మైఖేల్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అతను కీటకాలను అసహించుకుంటాను అని చెప్పాడు. కానీ ప్రజలు కీటకాల పచ్చబొట్లను చూసి అతను కీటకాలను ఇష్టపడతాడు అని అర్థం చేసుకుంటారు.
Advertisement
Also Read : సొంతపాటనే డీఎస్పీ కాపీ కొట్టాడా… వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ….!
గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం.. మైఖేల్ కంటే ముందు శరీరంపై ఎక్కువ కీటకాల టాటూలు వేయించుకున్న వ్యక్తి బాక్సర్ట్ మిల్సోమ్. అతని శరీరంపై మొత్తం 402 కీటకాల పచ్చబొట్లు ఉండేవి.
మైఖేల్ తన 21 సంవత్సరాల వయస్సులో శరీరంపై పచ్చబొట్లు వేసుకోవడం ప్రారంభించారు. ముందుగా తన చేతిపై ఎర్రచీమల పచ్చబొట్టు వేయించుకున్నాడు. తరువాత అతను టాటూలతో ఎంతగానో ప్రేమలో పడ్డాడు. మొత్తం శరీరాన్ని టాటూలతో కప్పుకున్నాడు.
Also Read : రోడ్డుపై 186 కేజీల గోల్డెన్ క్యూబ్..!