Home » సొంత‌పాట‌నే డీఎస్పీ కాపీ కొట్టాడా… వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ….!

సొంత‌పాట‌నే డీఎస్పీ కాపీ కొట్టాడా… వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ….!

by AJAY

సాధారణంగా హాలీవుడ్ పాటల మ్యూజిక్ నో బాలీవుడ్ పాటల మ్యూజిక్ నో అప్పుడప్పుడు కాపీ కొట్టి కొంతమంది సంగీత దర్శకులు దొరికిపోతూ ఉంటారు. అయితే ఇంగ్లీష్ పాటల మ్యూజిక్ ను కాపీ కొడితే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. మనం ఎప్పుడూ ఇలాంటి మ్యూజిక్ విన‌లేదు కదా అని లైట్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు సంగీతదర్శకులు తెలుగులో వచ్చిన పాటల మ్యూజిక్ ను కాపీ కొట్టి దొరికిపోతున్నారు. ఈమధ్య ఫోక్ సాంగ్ లను సైతం కాపీ కొట్టి సంగీతదర్శకులు దొరికిపోతున్నారు.

అప్పట్లో అల వైకుంఠపురం సినిమాలో నుండి ఓ పాట మ్యూజిక్ ను కాపీ కొట్టారని తమన్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. త‌మ‌న్ ఆ ట్రోల్స్ ను పట్టించుకోలేదు. ఇక ఇటీవల కాలంలో కూడా చాలా పాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపించేలా వస్తున్నాయి. మ‌రో వైపు సాంగ్స్ మ్యూజిక్ చిన్న పోలిక ఉన్నా మీమ‌ర్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా నుండి ఒక పాట విడుదలైంది.

ALSO READ : హౌలేగాళ్ల‌ను హీరోను చేశారు అంటూ బ‌న్నీపై టీఆర్ఎస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్యలు….!

devisriprasad

devisriprasad

ఆడాళ్ళు మీకు జోహార్లు అంటూ సాగే ఈ పాట సంగీతం మరియు రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమా లోని వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా అనే పాట మ్యూజిక్ అచ్చం ఒకే విధంగా ఉన్నాయి. దాంతో నెటిజ‌న్లు డిఎస్పి ని ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటని ఎక్కడో విన్నట్టుగా ఉంది అంటూ వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా పాటను జత చేస్తున్నారు. ఇక ఈ రెండు పాటలకు డీఎస్పీ మ్యూజిక్ అందించడం విశేషం.

devisriprasad

దాంతో మీ పాటను మీరే కాపీ కొట్టారా డిఎస్పీ గారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగానే ఈ రెండు పాటలకు డీఎస్పీ మ్యూజిక్ అందించడమే కాకుండా తన గొంతుతోనే పాడటం మరో చెప్పుకోదగ్గ విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాకు దర్శకుడు కూడా ఒక‌రే కావడంతో మీరైనా చెప్పాలి క‌దా డైరెక్ట‌ర్ గారూ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading