ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ కోసం ఎక్కువగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి వద్ద ఈ అప్లికేషన్ ఉంటుంది. వాట్సాప్ లో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. చాటింగ్ తోపాటు వీడియో కాలింగ్, నార్మల్ కాలింగ్ లాంటి సదుపాయాలు వాట్సాప్ లో ఉన్నాయి. ఫోటో షేరింగ్ వీడియో షేరింగ్… స్టేటస్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
ఇక వాట్సాప్ కి పోటీగా ఇప్పటివరకు ఎన్నో మెసేజ్ యాప్ లో వచ్చాయి కానీ నిలబడలేక పోయాయి. దానికి కారణం ట్రెండ్ కు తగినట్టుగా వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్లను తీసుకువస్తోంది.
Advertisement
Advertisement
ఇక తాజాగా వాట్సప్ మరో అప్డేట్ ను యూజర్ల కోసం తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. మెసేజ్ రియాక్షన్స్ పేరుతో ఈ అప్డేట్ ఉండబోతోంది. ఈ అప్డేట్ ద్వారా ఫోన్ కి వచ్చిన మెసేజ్ పై క్లిక్ చేసి వెంటనే దానికి రిప్లై ఇవ్వచ్చు. ఇప్పటికే ఇది ఫేస్ బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ లో అందుబాటులో ఉంది.
అంతేకాకుండా ఐ ఫోన్ లో మెసేజ్ తరహాలో మెసేజ్ రియాక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ అప్డేట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా మెసేజ్ కి రిప్లై టైప్ చేయకుండా వెంటనే ఆ మెసేజ్ పై క్లిక్ చేస్తే ఏమోజి లు వస్తాయి. ఆ ఏమోజీలతో త్వరగా రిప్లై ఇవ్వవచ్చు.