సినీరంగంలో తెలుగోడి సత్తాను రాజమౌళి కంటే ముందే దేశానికి చాటిన ఘనత అమ్మోరు సినిమాది! టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో అమ్మోరు సినిమాకు వాడిన గ్రాఫిక్స్ ను చూసి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ యే ముక్కున వేలేసుకున్నారు.! ఈ సినిమా పూర్తవ్వడానికి దాదాపు 4 ఏళ్ల సమయం పట్టింది.సౌందర్యకు 3వ సినిమాగా షూట్ ప్రారంభమైన ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి 27వ సినిమా అయ్యింది. అంటే ఆ గ్యాప్ లో సౌందర్య 24 సినిమాలు పూర్తిచేసిందన్నమాట! ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర రమ్యకృష్ణ. ఈ సినిమాలో ఆమె నటన నభూతో నభవిష్యత్!
Also Read: Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?
Advertisement
Advertisement
1995లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి 1.8 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే…ఈ సినిమా దాదాపు 11 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ సినిమాను తమిళ్, హిందీ భాషల్లోకి డబ్ చేశారు అక్కడ కూడా కోటి రూపాయలు వసూల్ చేసింది ఈ సినిమా!
ఈ సినిమాకంటే ముందే గ్రాఫిక్స్ ఉన్న విఠాలాచార్య సినిమాలు, భైరవద్వీపం సినిమా వచ్చినప్పటికీ ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ మూవీ మాత్రం ఇదే! తండ్రికొడుకులైన చక్రవర్తి, శ్రీ కొమ్మినేని ఇద్దరూ ఈ చిత్రానికి సంగీతాన్నందిచడం విశేషం!
Also Read: బాహుబలి దోశ తింటే రూ.71వేలు బహుమతి