Home » parvathi melton : పార్వ‌తి మెల్ట‌న్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..ఏం చేస్తుందంటే..!

parvathi melton : పార్వ‌తి మెల్ట‌న్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..ఏం చేస్తుందంటే..!

by AJAY
Ad

జ‌ల్సా సినిమాలో ప‌వ‌న్ కల్యాణ్ కు రెండో హీరోయిన్ గా న‌టించిన హీరోయిన్ పార్వతి మెల్ట‌న్. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా న‌టించగా పార్వతి మెల్ట‌న్ ఆమెకు సోద‌రిగా రెండో హీరోయిన్ గా న‌టించింది. ఇక మొద‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా సినిమాలో పార్వ‌తి మెల్ట‌న్ తోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ ఆమె తండ్రి ప్ర‌కాష్ రాజ్ ఓ రిచ్ అబ్బాయితో పెళ్లి చేస్తాడు. అలా ఇద్ద‌రూ దూర‌మ‌వుతారు. ఇక ఈ సినిమాలో ఇలియానా కంటే పర్వ‌తి మెల్ట‌న్ అందానికే ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

parvathi melton

parvathi melton

అంతే కాకుండా పార్వ‌తి మెల్ట‌న్ రాజా హీరోగా న‌టించిన వెన్నెల అనే సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. అందం అభినయం ఉన్న‌ప్ప‌టికీ పార్వ‌తి మెల్ట‌న్ గ్లామ‌ర్ డాల్ గానే ప్రేక్షుకులు ఇష్ట‌ప‌డేవారు. దాంతో పెద్ద‌గా హీరోయిన్ అవ‌కాశాలు రాలేదు. కానీ మ‌హేశ్ బాబు దూకుడు సినిమాలో పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ ఐట‌మ్ సాంగ్ కు పార్వ‌తి మెల్ట‌న్ చిందులు వేసింది.

Advertisement

Advertisement

parvathi melton

parvathi melton

అప్ప‌ట్లో ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇదిలా ఉండ‌గా మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ హీరోగా నటించిన హ‌ల్లో అనే సినిమాలో న‌టించి అల‌రించింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. చివ‌ర‌గా 2012లో ఈ బ్యూటీ య‌మ‌హో య‌మ అనే సినిమాలో క‌నిపించి ఆ త‌ర‌వాత సినిమాల‌కు దూరం అయ్యింది.కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పార్వ‌తి మెల్ట‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

parvathi melton

parvathi melton

త‌న సినిమా కెరీర్ నాశనం అవ్వ‌డానికి ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కార‌ణని చెప్పింది. అయితే ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల పేర్లు మాత్రం ఆమె వెల్ల‌డించ‌లేదు. అంతే కాకుండా 2013లో తాను శంసులాలానిని వివాహం చేసుకున్న‌ట్టు తెలిపింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

also read : ‘కమల్ హాసన్’ తో ‘గౌతమి’ విడిపోవడానికి అసలు కారణం ఇదేనట..!

Visitors Are Also Reading