సి.కె.నగేష్ అనగానే సౌత్ సినీ తెరపై నవ్వులను పూస్తాయి. వాస్తవానికి దక్షిణ భారతదేశంలో ఆయన లాంటి హాస్యనటుడు మరొకరు లేనే లేరు. అతను కేవలం హాస్యనటుడు మాత్రమే కాదు. రంగస్థల నటుడు కూడా. నగేష్ నటించిన పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు నేటికి క్లాసిక్ చిత్రాలుగానే నిలిచిపోయాయి. అందుకే ఆయనను దక్షిణాది చార్లి చాప్లిన్ అని, అభిమానులను ముద్దుగా అభివర్ణిస్తుండేవారు. గుండూరావు అనేది నగేష్ యొక్క అసలు పేరు.
Advertisement
కర్నాటకలోని తుముకూరు జిల్లాలోని చెయ్యూరులో 1933 సెప్టెంబర్ 27న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు నగేష్. చిన్నప్పుడే సినిమాలపై ఆసక్తితో మద్రాస్‌కు వచ్చేసాడు. ఆ తరువాత కాలంలో భారతీయ రైల్వేలో ఉద్యోగం కూడా చేశాడు. నాటకాలపై ఆసక్తితో తొలుత రంగస్థల నటుడిగా అవతారం ఎత్తి అలా సినిమా నటుడిగా గొప్ప హాస్య నటుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.
నగేష్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సర్వర్ సుందరం. 1964లో విడుదల అయిన ఈ సినిమాలో ఆయన నటన అపురూపం ఇక తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. ఈ చిత్రంలో ఆయన నవ్విస్తూనే ఏడిపించారు. అయితే నగేష్ జీవితంలో కూడా కొన్ని బాధకరమైన సంఘటనలున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఈగోలు ఎక్కువగా ఉంటాయి.
Advertisement
Also Read: జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర ఎవరో తెలుసా..! ఇంతకుముందు ఏం చేసేదంటే..!
స్టార్లుగా చలామణి అవుతున్న వాళ్ల మాటను చిన్న నటులు వినకపోతే వాళ్లకు లైఫ్ ఉండదు. నగేష్ జీవితంలో రుజువు అయిన సంఘటన ఇది. స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడంతో నగేష్ లో తెలియని ధైర్యముండేది. ఆ ధైర్యంతోనే ఓ సారి అప్పటి తమిళ స్టార్ ఎంజీఆర్ సెట్లోకి వచ్చినప్పుడు నగేష్ లేవలేదు. ఆ సంఘటనే నగేష్ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఎంజీఆర్ చెప్పడంతో అప్పట్లో నగేష్‌కు ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవాళ్లు కాదు. ఆ కాలంలో ఆయన ఎక్కువగా తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ నగేష్‌కు తన చిత్రాల్లో అవకాశాలు కల్పించారు.
ఎంజీఆర్ మాటను ఎదిరించే శక్తి ఆ రోజుల్లో ఎవరికీ లేకపోవడం వల్ల ఎన్టీఆర్ చొరువ తీసుకుని నగేష్ కి వరుసగా ఛాన్స్‌లు ఇప్పించడంతో పాటు ఆయన కూడా ఇచ్చారు. ఎంజీఆర్ తెలిసినా ఆయన ఎన్టీఆర్ ను అడగలేదట. ఎన్టీఆర్ సపోర్ట్ నగేష్‌కు ఉందని గ్రహించి.. అప్పటి నుంచి నగేష్ పై తన కోపాన్ని వదులుకున్నారు ఎంజీఆర్. ఎన్టీఆర్ అంటే.. ఎంతో అభిమానంగా ఉండేవారు. ఇక నగేష్ ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. ఎంజీఆర్ చిన్న నటుడుని తొక్కేస్తే.. ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారని ఎమోషనలయ్యారు.
Also Read: ఒక్కో LIC పాలసీకి… ఏజెంట్ కి ఎంత కమీషన్ వస్తుంది?