అప్పట్లో ఏ రాష్ట్రం పథకాలు ఆ రాష్ట్రంలో అమలు చేసేవారు. ఒక రాష్ట్రం పథకాలను మరో రాష్ట్రం సీఎం లు కాఫీ కొట్టేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రంలో మంచి పథకాలుగా గుర్తింపు వచ్చిన వాటిని తమ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచన లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం చెన్నైలో శనివారం జరిగింది.
Advertisement
Advertisement
కోటపాటి నరసింహ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, నీటి పారుదల ప్రాజెక్టులు పథకాలపై చర్చించామని తెలిపారు. అనంతరం స్టాలిన్ ను కలిసినట్టు నరసింహా నాయుడు తెలిపారు. కాగా అదే సందర్భం లో స్టాలిన్ తెలంగాణ పథకాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది.
Also Read: లాక్ డౌన్ లో బ్రహ్మానందం గారు గీసిన ఈ చిత్రాలు ఒకొక్కటి ఒక అద్భుతం ..!