కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ మూవీస్ చేసినా కిరణ్ మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆయన ఇప్పటికే రాజా వారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇలా పలు సినిమాలు చేశారు. ఇప్పుడు క సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. తాజాగా క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో కిరణ్ మాట్లాడారు. తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Advertisement
ఐదవ తరగతి వరకు ఆమె చదువుకున్నారని.. కూలి పని చేసేదని చెప్పారు. ఆమె ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొందని కిరణ్ చెప్పారు. మమ్మల్ని మంచి చదువులు చదివించాలని ఆమె కువైట్ కి వెళ్లి కష్టపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. కొడుకులు ఏదైనా సాధించండి అని తన తల్లి కోరిందని కిరణ్ అబ్బవరం చెప్పారు.
Advertisement
లైఫ్ అంతా కూడా హాస్టల్లో గడిచిందని.. నాన్న గురించి ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ లో చెప్పానని అన్నారు. అలాగే తన బంధువులు తనకి ఎంతకాలం సపోర్ట్ చేశారని చెప్పారు. కూలి పని స్థాయి నుంచి స్థాయికి వచ్చినట్లు చెప్పారు ఈరోజు బాధతో మాట్లాడుతున్నానని అన్నారు. అలాగే నా కష్టంలో ఏమాత్రం లోపం లేదని అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!