ఒక్కోసారి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఇప్పటివరకు బాగున్న జీవితం ఒక్కసారిగా అతలాకుతలమైపోవచ్చు. ఎప్పుడు జీవితంలో ఏది జరుగుతుందనేది ఎవరు ఊహించలేము. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మహిళ నక్షత్ర. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తన భర్త తేజ వేరే మహిళతో ఉండడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో నక్షత్ర ఎవరు అని అంత ఆరా తీస్తున్నారు. నక్షత్ర గతంలో మిస్ వైజాగ్ టైటిల్ ని గెలుచుకున్నారు వైజాగ్ పోటీల్లో నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. 2013 డిసెంబర్ నెలలో ఒక మూవీ ఆడిషన్ లో నక్షత్ర తేజ మధ్య పరిచయం ఏర్పడింది. షూటింగ్లో భాగంగా ఇద్దరు ప్రేమలో పడ్డారు 2015లో పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక పాప కూడా ఉంది. నక్షత్ర చెబుతున్న వివరాల ప్రకారం నావెల్ డాక్ యార్డ్ లో అతను ఉద్యోగం చేసేవాడు.
Advertisement
Advertisement
పబ్జి గేమ్ కి బానిసై డ్యూటీకి వెళ్లేవాడు కాదు గేమ్ ఆడుతూ అమ్మాయిలతో మాట్లాడేవాడు. ఉదయం నిద్రపోయేవాడు. అధికారులు జాబ్ నుండి సస్పెండ్ చేసేసారు అని ఆమె అన్నారు అలాగే పబ్జి గేమ్ లో అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడని ప్రశ్నిస్తే వేధించేవాడని ఆమె చెప్పారు. చాలామంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని ఆమె చెప్తున్నారు భర్త నిజ స్వరూపం బయటపడినప్పటి నుండి గొడవలు మొదలయ్యాయి 2021 నుండి ఇద్దరు మధ్య గొడవలు ఎక్కువయ్యాయని ఆమె చెప్పారు సినిమాలంటే పిచ్చి. సినిమాలు తీస్తా హీరో అవుతా అని బంగారం మొత్తం తాకిట్టు పెట్టేసాడని ఆమె అన్నారు. అతని తల్లిదండ్రుల వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు అని చెప్పారు తన భర్త తేజ ఉమనైజర్ ని ఆడితే కనపడితే వదిలిపెట్టడని అన్నారు అక్కని కూడా అదే ఉద్దేశంతో చూసేవాడని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం అతను ఏ పని చేయట్లేదని ఏమైనా చేసేది ఉందంటే అది ఎఫైర్లు నడపడం అని అన్నారు. తనను సంసారానికి పనికి రావని ఒక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పేవాడని ఆమె అన్నారు. మే 30న న్యాయం కోసం ధర్నాకు దిగారు నక్షత్ర. తన భర్త వేరే మహిళతో గదులు ఉన్నప్పుడు నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు విడాకులు ఇవ్వాలని భర్త తేజ వేరే మహిళను వివాహం చేసుకున్నారని ఆమె అన్నారు. నీ కూతురితో ఎలా బతుకుతావో చూస్తానని బెదిరిస్తున్నారని నక్షత్ర చెప్పారు. ఇలా కుటుంబ సమస్యల కారణంగా మిస్ వైజాగ్ కాస్త రోడ్డును పడ్డారు అయినా కూడా ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!