Ali : ఏపీలో రాజకీయాలు హిట్ ఎక్కాయి. సినీ నటులు కూడా ప్రచారంలో కనిపించట్లేదు టిడిపి వైసిపి లో నటులు ఉన్నారు. ఎవరు ప్రచారానికి రావట్లేదు. వైసీపీలో ఎమ్మెల్యే ఎంపీ సీటు ఆశించి బంగపడ్డ అలీ ప్రచారానికి ముఖం చాటేసారు. గుంటూరు తూర్పు నుండి ఎమ్మెల్యేగా కానీ రాజమండ్రి నుండి ఎంపీగా కానీ వైసీపీ బరి లోకి దిగుతారని ప్రచారం జోరుగా సాగింది చివరికి ఆలీకి ఎక్కడ సీటు దక్కలేదు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిపోయిన ఆలీకి రాజ్యసభ ఎంపీ వస్తుందని పుకార్లు వచ్చాయి. ఎన్నికలకి ఏడాది ముందు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్ట్ ఇచ్చారు అంతే. దీంతో అలీ చాలా అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది కనీసం తాడేపల్లి మొఖం కూడా చూడలేదు.
Advertisement
ఎన్నికల బరిలోకి దిగి అధ్యక్షా అని కనీసం పిలవాలని అలీ అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు. అసమ్మతితో ఉన్న అలీ రెండు పడవల మీద కాళ్లు వేశారని ప్రతిపక్ష పార్టీలతో టచ్ లో ఉన్నారని కూడా అందరూ అన్నారు. ఈ కారణంగానే జగన్ టికెట్ ఇవ్వలేదని టాక్ అయితే వచ్చింది. ఎన్నికల ఖర్చులు కూడా భారీగా పెరగడంతో అలిని రంగంలోకి దింపడానికి జగన్ వెనుకడుగేశారు.
Advertisement
Also read
- 80 ఏళ్ళ క్రితం నాటి కరెంట్ బిల్ ఇది.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
- Anupama Parameshwaran: సేమ్ అనుపమ పరమేశ్వరన్ లానే ఉన్న ఈమె ఎవరో తెలుసా..?
- శివాజి సినిమాలో ఈ అమ్మాయిలు మీకు గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా వున్నారంటే..?
అందుకే డబ్బు బాగా పోగేసిన వారిని ఎంచుకున్నారని వాదన ఉంది. ఐఏఎస్ గా వేలకోట్లు వెనకేసుకున్న ఒక వ్యక్తి కర్నూలు జిల్లా రంగం లోకి దింపారు జగన్ అలీ కి టికెట్ ఇవ్వడానికి మాత్రం ఆసక్తి చూపించలేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కూడా సైలెంట్ అయిపోయారు వైసీపీలో చేరి జగన్ అంతా పోటుగాడు లేదని తెగ బిల్డప్ ఇచ్చారు. టీటీడీలో కీలక పదవి రాగానే ఫోన్ కాల్ ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయి పదవిని కోల్పోయాడు తర్వాత కొంతకాలం సినిమాలో కూడా లేక ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!