Home » Family Star Review: ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసాడా..?

Family Star Review: ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసాడా..?

by Sravya
Ad

Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించారు. పరశురామ్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గీత గోవింద వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబో వచ్చిన మూవీ కనుక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వున్నాయి.

  • సినిమా: ఫామిలీ స్టార్
  • నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు.
  • దర్శకత్వం: పరశురామ్
  • నిర్మాత: దిల్ రాజు
  • సంగీతం: గోపీ సుందర్
  • రిలీజ్ డేట్: 05-04-2024

కథ మరియు వివరణ:

Advertisement

ఇక కథ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ఇందులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిలా కనిపించదు. విజయ్ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తన ఫ్యామిలీ లో ఉన్న అన్ని సమస్యల మధ్య లో నలిగిపోతూ ఉంటాడు. ఇక హీరోయిన్ మృణల్ కి తనకు మధ్య పెళ్లి తర్వాత విభేదాలు రావడం, దీనితో వాళ్లు కలిసి ఉంటారా లేదంటే విడిపోతారా అనే అంశం పై ఈ మూవీ ని తెర మీదకు తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే.. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పరుశురాం పూరి జగన్నాథ్ మూవీస్ లో వుండే ఫ్లేవర్ ని ఈ సినిమా లో చూపించారు.

Advertisement

సెకండాఫ్ లో ఎమోషనల్ టచ్ ని ఇచ్చారు. విజయ్, మృణాల మధ్య కొన్ని సీన్లు అదిరిపోయాయి. అందుకు తగ్గట్టు పరుశురాం రాసుకున్న సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. మూవీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. విజయ్ బాడి లాంగ్వేజ్ కి తగ్గట్టు కథతోనే ఈ సినిమాను తీశారు. పరుశురాం గోపి సుందర్ చేత ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ని ఇచ్చారు. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో. అలానే మృణాల్ నటన కూడా బావుంది. ఆర్టిస్టులందరూ కూడా అదరగొట్టేసాడు. సినిమాటోగ్రాఫర్ గా చేసిన కేయూ మోహనన్ విజువల్స్ తో అదరగొట్టేసాడు.

ప్లస్ పాయింట్స్

స్టోరీ
డైరెక్షన్
విజయ్, మృణల్ ఠాకూర్ నటన
ఎమోషనల్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్

గోపి సుందర్ మ్యూజిక్
స్లో గా నడిచే సీన్స్

రేటింగ్: 2.75/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading