Home » Samantha: అన్నిటికీ అందరూ సిద్ధంగా ఉండాలి.. కళ్ళు తిరిగి కిందపడిన సామ్ ఏం చెప్పారంటే..?

Samantha: అన్నిటికీ అందరూ సిద్ధంగా ఉండాలి.. కళ్ళు తిరిగి కిందపడిన సామ్ ఏం చెప్పారంటే..?

by Sravya
Ad

Samantha: హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకుంది సమంత. చాలా కాలం నుండి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది పైగా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. సినిమాలతో, వైవాహిక జీవితంలో విడాకులతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే వుంది. రీసెంట్ గా ఈమె కి సంబంధించిన ఒక వార్త మళ్ళీ వైరల్ అవుతోంది. గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి సమంత చెప్పింది. అది వింటే ఆమె ఎలాంటి పరిస్థితుల నుండి బయటపడిందో అందరికీ అర్థమవుతుంది.

samantha

Advertisement

రీసెంట్ గా సమంత కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. ఈ వ్యాధి తగ్గుతుంది అనుకుంటే అది నాకు పెద్ద సమస్యను తీసుకువచ్చింది. మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించొచ్చు అనుకుని సిటాడెల్ కి సైన్ చేశాను కానీ అదే సమయం చాలా కష్టంగా అనిపించింది శారీరకంగా బలహీనంగా ఉన్న సమంతకి యాక్షన్ సీన్స్ ఉంటాయి అని ముందే చెప్పారట. అయినా కూడా ఆమె ఓకే చెప్పింది షూటింగ్ అప్పుడు శక్తి పూర్తిగా నశించి కళ్ళు మూతలు పడిపోయాయి. బాగా అలసిపోయి స్పృహని కూడా తప్పి కింద పడిపోయింది సమంత.

Also read:

Advertisement

Another new disease for Samantha

Another new disease for Samantha

ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోయారట కాసేపటికి కోలుకొని సమంత ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అని అనుకున్నారట. ఈ సిరీస్ కోసం ఎంతో కష్టపడ్డారు సమంత. ఈ సిరీస్ చాలా స్పెషల్ అని సమంత చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని అన్నిటికీ అందరూ సిద్ధంగా ఉండాలని వివరించారు ఓర్పుతో ముందుకు వెళ్తే కెరియర్ అందంగా ఉంటుందని సమంత సలహా ఇచ్చారు. సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత ముందు లాగే సినిమాల్లో నటించాలని మంచి హిట్లు ఆమెకి రావాలని కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో సమంత ఎటువంటి సినిమాలో సినిమాలు చేస్తుందో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading