Home » సెల్ ఫోన్ కి ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా..?

సెల్ ఫోన్ కి ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా..?

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వారు ఎవ్వరూ ఉండరు. నూటికి ఒక్కరిద్దరూ తప్ప.. పల్లెటూర్లలో, మారుమూల ప్రాంతాల వారు తప్ప అందరూ ఫోన్ వినియోగిస్తున్న వారే. ఇక ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు చాలా మంది చేతిలో ఉంటాయి. వేల రూపాయల నుంచి మొదలుకొని లక్షల రూపాయల వరకు ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

 

స్మార్ట్ ఫోన్ వాడే చాలా మందికీ దాని గురించి పలు విషయాలు తెలియవు. మన సెల్ ఫోన్లలో అవుట్ డోర్ గురించి తెలిసిన వాళ్లు చలా తక్కువే. సెల్ ఫోన్ కింది భాగంలో ఉండే  ఈ చిన్న   రంధ్రం మీరు  ఎప్పుడైనా గమనించారా? అది దేనికి అని మీకు తెలుసా?.. చాలా మందికి దీనికి సమాధానం తెలియకపోవచ్చు.ఆ చిన్న రంధ్రం మన ఫోన్‌లోని నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్. వివరంగా చెప్పాలంటే.. మనం సెల్ ఫోన్‌లో మాట్లాడేటప్పుడు మైక్రోఫోన్ పనిచేస్తుంది.

Advertisement

మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ మైక్రోఫోన్ యాక్టివేట్ అవుతుంది. ఆ చిన్న రంధ్రం మన స్వరాన్ని సంపూర్ణంగా ఎంచుకొని, అవతలివైపు ఉన్న వినేవారికి స్పష్టంగా ప్రసారం చేస్తుంది. అదే సమయంలో ఈ మైక్రోఫోన్ చుట్టూ శబ్దం ఉన్నప్పటికీ అన్ని రకాల శబ్దాలను ఇది గ్రహించదు. సెల్ ఫోన్ దిగువన శబ్దం గ్రహించడాన్ని అడ్డుకుంటుంది. అదే సమయంలో, మనం మాట్లాడే స్వరం రంధ్రానికి ఖచ్చితంగా దగ్గరగా ఉంటుంది కాబట్టి వాయిస్ మరొక వైపు(అవతలివైపు వాళ్లకి) స్పష్టంగా వినబడుతుంది.

Visitors Are Also Reading