Home » చిరంజీవికి తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ చెప్పిన మాట ఏంటో తెలుసా ?

చిరంజీవికి తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ చెప్పిన మాట ఏంటో తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో తన సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇలాంటి చిరంజీవి చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ లను సాధించాయి.

Advertisement

చిరంజీవి వంటి నటుడికీ తన కెరీర్ తొలుత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఎంజీఆర్ ఓ ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేశాడట . అదేంటంటే..? షూటింగ్ స్పాట్ లో ఓ ఆర్టిస్టు ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు.. కానీ ఫైనల్ మాత్రం మనం సాటిస్ పై అవుతూ.. ప్రేక్షకులను సాటిస్పై చేసేవిధంగా నటనని మాత్రమే మనం చేయాలి. దాని కోసం షూటింగ్స్ స్పాట్ లో ఎంత కష్టపడ్డా పర్లేదు.. కానీ సినిమా చేసిన తరువాత ఇది ఇంకొంచెం బాగా చేసి ఉంటే.. బాగుండేది కదా అనే ఫీలింగ్ మాత్రం మనకు ఉండకుండా చూసుకోవాలి అని ఓ మాట చెప్పాడంట.

Advertisement

దీంతో చిరంజీవి ఆ మాటను బలంగా నమ్ముతూ ప్రతీ సినిమా షూటింగ్ లో ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు.. కానీ అవుట్ ఫుట్ మాత్రం అద్భుతంగా వచ్చే విధంగా జాగ్రత్త పడుతుంటాడట. చిరంజీవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గుర్తింపు రావడమే కాకుండా.. 70 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు. ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్ లో చిరంజీవి తరువాత మరికొంత మంది దర్శకులతో సినిమాలు చేసేందుకు వాళ్లను కూడా లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. విశ్వంభర మూవీ తన కెరీర్ కి మరో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా అవుతుందని చిరంజీవి భావిస్తున్నాడట. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.

Also Read :  కన్నప్పగా అదరగొట్టిన మంచు విష్ణు.. ఆకర్షిస్తున్న ఫస్ట్ లుక్..!

Visitors Are Also Reading