Home » మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య పాటలకు డాన్స్ వేసిన సినీశెట్టి !

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య పాటలకు డాన్స్ వేసిన సినీశెట్టి !

by Anji
Published: Last Updated on

భారత్ వేదికగా 71 మిస్ వరల్డ్ 2024 పోటీలు జరుగుతున్నాయి.  ఫిబ్రవరి 18న మొదలైన ఈ పోటీలు రేపటితో ముగియనున్నాయి. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ పోటీలు కొనసాగుతున్నాయి. మిస్ వరల్డ్ 2024 కాంపిటీషన్స్ లో 120 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటున్నారు. భారతదేశం నుంచి ఫెమినా మిస్ ఇండియా సినీ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తుంది. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీలు చివరి దశకు వచ్చేశాయి. మరికొద్ది గంటల్లో మిస్ వరల్డ్ 2024 విజేత ఎవరో తేలనుంది.

ముఖ్యంగా  ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనడానికి దాదాపు రెండేళ్ల నుంచి ప్రిపేర్ అయిన సినీ.. ఇప్పటికే జరిగిన పలు ఛాలెంజ్ రౌండ్స్ సత్తా చాటింది. ‘హెడ్ టూ హెడ్ ఛాలెంజ్’ లో టాప్ 25, ‘టాలెంట్ రౌండ్’ లో టాప్ 14, ‘టాప్ మోడల్ ఛాలెంజ్’ రౌండ్ లో టాప్ 20 గా నిలిచిన సినీ.. మిస్ వరల్డ్ టైటిల్ లక్ష్యంగా దూసుకెళ్తుంది. టాలెంట్ రౌండ్ లో భాగంగా సినీ.. మాజీ ఐశ్వర్య రాయి సూపర్ హిట్ పాటలకు డాన్స్ వేసి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. “నింబూడా”, “తాల్ సే తాల్ మిలా” బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని “కజ్రా రే” పాటలకు సాంప్రదాయ వస్త్రాలంకారణలో నృత్య ప్రదర్శన చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సినీ.. అసమానమైన, అద్భుతమైన మిస్ వరల్డ్ 1994 ఐశ్వర్య రాయి పాటలను నా టాలెంట్ రౌండ్ లో ప్రదర్శించడం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చింది.

Also Read :  ‘కల్కి’ లో ప్రభాస్ పేరు ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading