Home » ఒకే కథతో ఒకే రోజు రెండు సినిమాలు.. ఎన్టీఆర్ కి ఎదురెళ్లి మరీ నష్టపోయిన సూపర్ స్టార్ కృష్ణ..!

ఒకే కథతో ఒకే రోజు రెండు సినిమాలు.. ఎన్టీఆర్ కి ఎదురెళ్లి మరీ నష్టపోయిన సూపర్ స్టార్ కృష్ణ..!

by Anji
Ad

సాధారణంగా ఒకే కథతో చాలా సినిమాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంత గ్యాప్ తో తీస్తారు.. కానీ మనం రీమేక్స్ అంటుంటాం. అలా కాకుండా ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రూపొందితే ఎలా ఉంటుంది..? అలా టాలీవుడ్ లో చాలా సందర్భాల్లో జరిగింది. 1993లో  కృష్ణ ఫిలింస్‌ ‘సావిత్రి’, ఈస్ట్‌ ఇండియా ‘సతీ సావిత్రి’, 1933లోనే ఇంపీరియల్‌ ‘రామదాసు’, ఈస్ట్‌ ఇండియా ‘రామదాసు’ , 1938లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’, ‘ద్రౌపది మానసంరక్షణం’, 1942లో జెమిని వారి ‘బాలనాగమ్మ’, శాంత వారి ‘బాలనాగమ్మ’,   1950లో ‘లక్ష్మమ్మ’, ‘శ్రీలక్ష్మమ్మ కథ’.. ఇలా ఒకే కథతో పోటాపోటీగా సినిమాలు నిర్మించారు.

Advertisement

తెలుగు సినిమా పుట్టిన తొలినాళ్ళలో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాల గురించి అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. ఆ తర్వాత అంటే 26 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి వచ్చింది. నటరత్న ఎన్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ‘దానవీరశూర కర్ణ’ చిత్రాన్ని ప్రారంభించే సమయంలోనే సూపర్‌స్టార్‌ కృష్ణ ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ రెండు సినిమాలూ మహాభారత యుద్ధం నేపథ్యంలోనే రూపొందడం విశేషం. సినీ కెరీర్ లోనే దానవీరశూరకర్ణ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లోనే కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్ నీ మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఇందులో ఎన్టీఆర్ గెటప్, డైలాగ్స్ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. దానవీరశూరకర్ణ సినిమాకు ఎన్టీఆర్ అన్ని స్వయంగా తానే వ్యవహరించారు. ముఖ్యంగా దర్శకత్వం వహించడంతో పాటు  కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు పాత్రల్లో నటించాడు ఎన్టీఆర్. దాదాపు 226 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 10 లక్షల బడ్జెట్ తో నిర్మించారు. 

Advertisement

అప్పట్లోనే దాదాపు ఒకటిన్నర కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. మూడు గంటలకు పైగా నిడివి కలిగిన ఈ సినిమాకు రెండు ఇంటర్వెల్స్ వేసేవారట. ప్రేక్షకులు అయినా విసుగు చెందకుండా ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా చూశారట. 1994లో రీ రిలీజ్ చేయగా మళ్లీ భారీ వసూలు సాధించడం విశేషం. దానవీరశూరకర్ణ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ ఎదురెళ్లి మరి నష్టపోయారు. ఓవైపు ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ చిత్రం చేస్తుంటే మరోవైపు మహాభారతం సబ్జెక్టుతో కురుక్షేత్రం టైటిల్ తో ఓ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. ఇందులో కృష్ణ అర్జునుడిగా, శోభన్ బాబు కృష్ణుడిగా, కృష్ణంరాజు కర్ణుడిగా పాత్రలు చేశారు. ఎన్టీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ కురుక్షేత్రం చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగింది.  1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం సినిమాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్, కృష్ణ అభిమానుల మధ్య ఎంతో ఉత్కంఠ నెలకొంది. దానవీరశూరకర్ణ మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించింది. కురుక్షేత్రం మూవీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ ముందు కృష్ణ నిలబడలేకపోయారు.

Also Read :  టాలీవుడ్ స్టార్ హీరో పేరును తన కొడుక్కి పెట్టిన సింగర్ గీతామాధురి..!

Visitors Are Also Reading