సాధారణంగా మీ యొక్క తోటి ఫ్రెండ్స్ నో, ఇష్టమైన వాళ్లనో ప్రేమగా పిలిచేటప్పుడు చాలామంది డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇంకొందరు డ్యూడ్, హాయ్ బంగారం అంటూ కూడా సంబోధిస్తుంటారు. అయితే ఇకపై డార్లింగ్ అనే పదానికి వాడటానికి వీలు లేదట. ఈ విషయమై కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘డార్లింగ్’ అనే పదానికి లైంగిక అర్థం ఉందని, సెక్షన్ 354ఏ(1) (4) కింద అభ్యంతరకరమైన వ్యాఖ్యలని జస్టిస్ జే సేన్ గుప్తా ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో కింది కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించిన జనక్ రామ్ అప్పీల్ పై శుక్రవారం విచారణ జరిగింది. పోర్ట్ బ్లెయిర్ లోని సర్క్యూట్ బెంచ్ లో అప్పీల్ పై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపారు.
Advertisement
Advertisement
2015 అక్టోబర్ 21న అండమాన్ లోని మాయాబందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ కు ‘క్యా డార్లింగ్ చలాన్ కర్నే ఆయ్ హే క్యా’ అని కామెంట్ చేశాడు ఓ నిందితుడు. పండుగ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అభ్యంతరకరంగా కామెంట్ చేసినందుకు కోర్టు పరిశీలనలోకి తీసుకుంది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు ధృవీకరించింది. కానీ జైలు శిక్షను మూడు నెలల నుండి ఒక నెలకు సవరించింది. అంతకుముందు 2023 ఏప్రిల్లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, 2023 నవంబర్లో అదనపు జిల్లా జడ్జి రామును దోషిగా నిర్ధారించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
డార్లింగ్ ను కాస్త కఠినంగా చెప్పినందుకు ఒక వ్యక్తికి నెల రోజుల జైలు శిక్ష విధించి, హెచ్చరించవచ్చునని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ బిమల్ ఛటర్జీ అన్నారు. అయితే ఓ లేడీ కానిస్టేబుల్ డ్యూటీలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఇలాంటి ఘాటుగా కామెంట్ చేయడం బాధాకరం.
Also Read : ఎన్టీఆర్ దిన చర్య గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా..!