Home » హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసారుగా..!

హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసారుగా..!

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. ఒకపక్క సినిమాలు మరో పక్క పాలిటిక్స్ తో పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్లడం కష్టంగానే ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఏపీ ఎన్నికల మీదే ఉంది. ఇందుకోసం తన చేతిలో ఉన్న సినిమా షూటింగ్లను నిలిపివేశారు. పవన్ సినిమాల సంగతి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ అయితే డీలా పడిపోయారు. హరిహర వీరమల్లు సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఈ సమయంలో బయటకు వచ్చింది ఇటీవల హర హర వీర మల్లు చిత్ర నిర్మాత రత్నం ఈ ప్రాజెక్టు కోసం మాట్లాడారు హరిహర వీరమల్లు సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

సినిమా క్యాన్సిల్ అవుతుందని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ అభిమానులకి మంచి సినిమా ఇచ్చే విషయంలో మేము కట్టుబడి ఉన్నామని కేవలం లాభం మాత్రమే మా ఉద్దేశం కాదు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని రత్నం చెప్పారు.

Advertisement

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ స్టార్ బాబి డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ఆగిపోయింది అని వార్తలు రావడంతో ఇటీవల నిర్మాణ సంస్థ ఒక క్లారిటీని ఇచ్చింది. హరిహర వీరమల్లు సినిమా వీఎఫెక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లో జరుగుతున్నాయని చెప్పారు. ఈ చిత్రం మీ అందరి ఊహలకి మించి ఉండబోతుందని మీ అందరిని థియేటర్లలో సీటు అంచున కూర్చోబెట్టి ఒక స్పెషల్ ప్రోమీ ని త్వరలో వదులుతామని పోస్ట్ చేశారు ప్రస్తుతానికి హాట్ టాపిక్ అవుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading